అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్: పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదు..

|
Google Oneindia TeluguNews

పార్టీ పెడతానని ప్రకటించి సంచలనం సృష్టించిన వైఎస్ షర్మిల.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కాక తెలంగాణలో పార్టీ పెడతానని చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎందుకు అని అడుగగా.. తాను తెలంగాణ కోడలినని షర్మిల చెప్పారు. అయితే తాజాగా జగన్ గురించి షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

జగన్‌కు ఇష్టం లేదు

జగన్‌కు ఇష్టం లేదు

రాజకీయ పార్టీ పెట్టడంపై జగన్‌కు ఇష్టం లేదని షర్మిల అన్నారు. తొలుత జగన్‌కు ఇష్టమేనని చెప్పారు. కానీ ఇవాళ జగన్ అయిష్టత అని కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య సంబంధాలు సరిగా లేవని మరోసారి నిరూపణ అయ్యింది. పైకి మాత్రం అదేం లేదని ఇన్నాళ్లూ.. వారించినా.. ఇప్పుడు విభేదాలు బయటపడ్డాయి. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో అగ్గిరాజేశాయి.

 పదవీ ఎందుకు ఇవ్వలేదు

పదవీ ఎందుకు ఇవ్వలేదు

అంతేకాదు తనకు పదవీ ఎందుకు ఇవ్వలేదో అంటూ తేనేతెట్టేను కదిపే ప్రయత్నం చేశారు షర్మిల. పదవీ ఇవ్వని విషయం జగన్‌ అడగాలని సూచించారు. తనకేం తెలుసు అని కామెంట్ చేశారు. తనకు తల్లి విజయమ్మ మద్దతు ఉందని చెప్పారు. ఆమె ఆశీర్వాదంతో పార్టీ పెట్టి.. ముందుకు సాగుతానని తెలియజేశారు. ఎవరీ సపోర్ట్ ఉన్నా లేకున్నా.. తాను ముందుకెళతానని చెప్పారు. తనను ఎవరూ ఆఫలేరు అని.. ప్రజా విశ్వాసం, బలం తనకు ఉందని.. ఉంటుందని ఆమె విశ్వాసంతో ఉన్నారు.

తెలంగాణ కోడలిని

తెలంగాణ కోడలిని

షర్మిల స్థానికత అంశం చర్చకు వచ్చింది. ఏపీలో కాక.. తెలంగాణలో ఎందుకు పార్టీ స్థాపిస్తున్నారని చర్చ జరిగింది. దీనిపై షర్మిల ఘాటుగానే స్పందించారు. కేసీఆర్, విజయశాంతి ఎక్కడివారు అని అడిగారు. తన పుట్టినిట్టు ఏపీ కాగా.. మెట్టినిల్లు తెలంగాణ అని చెప్పారు. తాను తెలంగాణ కోడలినని చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గడప గడపకు వెళ్తానని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. ప్రజల ఆదరణతో ముందుకు సాగుదామని తెలియజేశారు.

తిరగబడిన బాణం..?

తిరగబడిన బాణం..?

షర్మిల కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జగనన్న బాణం అంటూ పాదయాత్ర చేసిన షర్మిల.. చివరికీ తిరగబడిందని సెటైర్లు వేస్తున్నారు. అన్నను మించి చెల్లె అంటున్నారు. మరికొందరు జగన్ కోసం షర్మిల కష్టపడ్డారని చెబుతున్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పార్టీ కోసం పనిచేశారని గుర్తుచేశారు. అహోరాత్రులు శ్రమించి.. పార్టీని ఒక స్టేజీకి తీసుకొచ్చారని తెలిపారు. అంతా చేసిన ఆమెకు పదవీ ఇవ్వకపోవడాన్ని కొందరు తప్పుపట్టారు. మరికొందరు మాత్రం రాజకీయాల్లో అన్నీ కామనే అంటూ కొట్టిపారేస్తున్నారు.

English summary
establish new party.. but ys jagan not interested ys sharmila hot comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X