• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మొబైల్ టెస్టుల కేంద్రాలు ఏర్పాటు చేయండి, ఏపీ సర్కార్‌కు పవన్ సూచన

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలలో వస్తోన్న కరోనా కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది.. ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఇవీ ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారిన పడుతుండడం దాని తీవ్రతను తెలియచేస్తోందన్నారు.

బాబుకు కరోనా

బాబుకు కరోనా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకుని.. ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలని సూచించారు.

అలా అయితే యూజ్

అలా అయితే యూజ్


మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదని అభిప్రాయపడ్డారు.

వాయిదా..

వాయిదా..


కరోనా ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందన్నారు.

డైయిలీ నీడ్స్

డైయిలీ నీడ్స్


ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ లేకుండా దయచేసి బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
establish mobile testing centres in the andhra pradesh. janasena chief pawan kalyan asks government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion