అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నుండి వ‌ల‌స‌లు షురూ : మాజీ మంత్రి రావెల గుడ్ బై : రేపు జ‌న‌సేన‌లోకి ఎంట్రీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : టిడిపి కాంగ్రెస్ పొత్తు : ఎవ‌రి సీట్ల‌కు ఎసరు పెడ‌తారో ?| Oneindia Telugu

ఎన్నిక‌లు స‌మీపిస్తున్ వేళ‌..ఏపిలో అధికార పార్టీ నుండి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష పార్టీని ఫిరాయింపుల తో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. కేంద్ర‌పై యుద్దం పేరుతో బిజెపిని ప్ర‌జ‌ల‌కు దూరం చేయ‌టం లో కొంత వ‌ర‌కు స‌క్సెస అయింది. ఇక‌, రాజ‌కీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న స‌మ‌యంలో..ఆ పార్టీ నుండి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. పార్టీ అధికారంలో ఉండ‌టంతో ఇప్ప‌టి వ‌ర‌కు గుంభ‌నంగా ఉన్న అసంతృప్త నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే, ఓన్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ త‌రువాత రాజ‌కీయంగా వ‌ల‌స‌లు మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

ఏపిలో అధికార పార్టీ లో ఉన్న అసంతృప్త నేత‌లు బ‌య‌ట ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా సీటు ద‌క్కిం చుకొని..ఆ త‌రువాత అంతే అనూహ్యంగా మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారు సైతం ఈ లిస్టులో ఉన్నారు. 2014 లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుండి స‌డ‌న్ గా టిక్కెట్ ద‌క్కించుకున్న మాజీ రైల్వే అధికారి రావెల కిషోర్ బాబు క్యాబినెట్ విస్త‌ర‌ణ లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. సాంఘిక - గిరిజ‌న సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే, ప‌ని తీరు..పార్టీలో స‌మన్వ‌యంలో ఆయ‌న పై వ్య‌తిరేక‌త క‌నిపించింది. దీంతో.. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న్ను మంత్రి ప‌ద‌వి నుండి తొలిగించారు. అప్ప‌టి నుండి రావెల కిషోర్ బాబు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. అప్ప‌టి నుండి వైసిపి..జ‌న‌సేన పార్టీల్లోకి ఎంట్రీ కోసం ప్ర‌య‌త్ని స్తున్న‌ట్లు స‌మాచారం. వైసిపి లో సీటు పై హామీ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో..రెండు సార్లు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తో స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప‌వ‌న్ నుండి వ‌చ్చిన హామీ మేర‌కు జ‌న‌సేన లో చేరాల‌ని రావెల కిషోర్ బాబు డిసైడ్ అయ్యారు. డిసెంబ‌ర్ 1న ఆయ‌న టిడిపికి రాజీనామా చేసి..జ‌న‌సేన‌లో చేరుతార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ex Minister..sitting tdp mla Ravela Kishore Babu joining in Janasena..!

ఇక‌, రావెల లాగానే మ‌రి కొంత మంది అధికార పార్టీ నేత‌లు సైతం త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ పై డైల‌మా లో ఉన్నారు. దీంతో...కొంద‌రు అధికార పార్టీ నుండి వైసిపి .. జ‌న‌సేన పార్టీల వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. విశాఖ జిల్లా లో కీల‌క నేత ఒక‌రు జ‌న‌సేన నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గుంటూరు జిల్లా నుండి మాజీ ఎంపి..ప్ర‌స్తుత ఎమ్మెల్యే సైతం టిడిపిని వీడ‌టం ఖాయ‌మ‌నే ప్ర‌చారం. ఇక‌, ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు ప్ర‌స్తుత ఎమ్మెల్సీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్కెట్ల ఖ‌రారు సై స్ప‌ష్ట‌త ఇస్తే స‌రి..లేకుంటే పార్టీ మార‌టానికి సిద్దంగా ఉన్న‌ట్లు ఆ జిల్లాలో జోరుగా ప్ర‌చారంలో ఉంది. టిడిపి అధినేత అనూహ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టంతో...ఎవ‌రి సీట్ల‌కు ఎర్త్ పెడ‌తారో అనే చ‌ర్చ కూడా టిడిపి వ‌ర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత‌..అక్క‌డి ఫ‌లితాల ఆధారంగా ఏపి లో కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, వైసిపి లో సీట్లు రాని వారు సైతం ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు వైసిపి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించారు. వారే దాదాపు నియోజ‌క‌వ‌ర్గాల నుండి వైసిపి అభ్య‌ర్ధులుగా పోటీ చేయ‌నున్నారు. దీనికి తోడు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి ఇన్‌ఛార్జ్ లుగా ప‌ని చేసిన వారిని మార్చి కొత్త వారికి అవ‌కాశం ఇస్తున్నారు. దీంతో..ఈ అసంతృప్తుల్లో అధిక శాతం పార్టీ మారే అవ‌కాశాలు లేక పోలేదు. ఇదే స‌మయంలో..జ‌న‌సేన‌లో అభ్య‌ర్ధుల హంగామా పెద్ద‌గా లేక‌పోవ‌టంతో.. ఆ పార్టీలోకి వెళ్లి అదృష్టాన్ని ప‌రీక్షించుకొనేందుకు కొంద‌రు నేత‌లు సిద్ద‌మ‌వుతున్నారు.

English summary
ex minister and sitting TDP Mla Ravela Kishore Babu joining in Janasena. Many leaders form all parties are in thier trails for jumping to other parties. After vote on account Budget Jumpings may be high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X