అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎలుక‌ల కోసం 8 కోట్ల పైగా బ‌డ్జెట్ : ప‌ట్టినా ప‌ట్ట‌కున్నా చెల్లించాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

ఏపి ఆరోగ్య శాఖ‌లో తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అవుతున్నాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌తుల్లో ఎలుక‌లు.. కీట‌కా ల నిర్మూల‌న పేరుతో నెల‌కు 70 లక్ష‌ల నిధులు విడుద‌ల చేస్తున్నారు. సాలీనా 8.4 కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నా రు. ప్ర‌భుత్వంలోని ముఖ్యుల‌కు సంబంధించిన వారికి కాంట్రాక్టు అప్ప‌గించి..వీటిని నిర్మూలించినా..లేకున్నాఏడాది కి 8.4 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇది విన్న వారు విస్తుపోతున్నారు..

ఎలుకలు

ఎలుకలు

ఏపిలో ఎలుకలు ప‌ట్టుకోవ‌టం పేరుతో కోట్లాది రూపాయాల‌ను వెచ్చిస్తున్నారు. ఎలుక‌ల‌ను ప‌ట్టుకున్నా..పట్టుకోకున్నా వారికి ఈ కోట్లాది రూపాయాలు చెల్లించాల్సిందే. రాష్ట్రంలోని 11 వైద్య క‌ళాశాల‌ల‌కు..బోధ‌నసుప‌త్రులు ఉన్నాయి.
వాటి లో పారిశుద్ద్యం..సెక్యూరిటీ స‌ర్వీసులు గ‌తంలో ఒకే కాంట్రాక్ట‌ర్ కు ఇచ్చేవారు. కొంత కాలం క్రితం గుంటూరు లోని ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ఎలుకొలు కొరికి శివువు మృతి చెందాడు.ఆ త‌రువాత ప్ర‌భుత్వం ఆస్ప‌త్రుల్లో కీట‌కాలు..

రూ.8.4 కోట్ల ను విడుద‌ల

రూ.8.4 కోట్ల ను విడుద‌ల

ఎలుక ల‌ను ప‌ట్టుకోవ‌టం కోసం ప్ర‌త్య‌కంగా కాంట్రాక్ట‌ర్ ను నియ‌మించాని నిర్ణ‌యించారు. దీని కోసం నెల‌కు 70 ల‌క్ష‌ల రూపా యాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.
దీని ద్వారా ఏడాది రూ.8.4 కోట్ల ను విడుద‌ల చేస్తున్నారు. రెండేళ్ల కాలంగా ఏపి ప్ర‌భుత్వంలో ఈ తంతు న‌డుస్తోంది. గ‌త రెండేళ్ల కాలంగా ఆ కాంట్రాక్ట‌ర్ కు దాదాపు 17 కోట్ల రూపాయాల వ‌ర‌కు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది.
టిడిపి ముఖ్య నాయ‌కుల‌కు చెందిన స‌న్నిహితుడే కాంట్రాక్ట‌ర్ గా చెబుతున్నారు.

ఎలుక‌లు ప‌ట్టుకున్నారా..

ఎలుక‌లు ప‌ట్టుకున్నారా..

ఇప్ప‌టికీ అనేక ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితి య‌ధాత‌ధంగా ఉంది. ఎక్క‌డా ప‌ట్టుమ‌ని ప‌ది ఎలుక‌ల‌ను కూడా ప‌ట్టుకున్న సంద‌ర్భాలు లేవ‌ని తెలుస్తోంది. కేవ‌లం కీట‌కాల నిరోధం కోసం మందులు వినిగిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయినా.. ఇప్ప‌టికే అనేక పెద్ద అస్ప‌త్రుల్లోనూ కీట‌కాలు ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి. కేవ‌లం డబ్బు చేస‌కోవ‌టం కోస‌మే ఈ కాంట్రాక్ఠ్ ను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయాలు బిల్లులు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికీ అనేక ఆస్ప‌త్రుల్లో ప్ర‌ధానంగా ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌లో కీట‌కాలు.. కొన్ని ప్రాంతాల్లో ఎలుక‌లు ఉన్నాయంటూ ఆ శాఖ అధికారులే చెబుత‌న్నారు మ‌రి. ప్ర‌జాధ‌నం ఈ స్థాయిలో దుర్వినియోగం అవుతుంద‌న్న విమ‌ర్శల పై ఎలా స్పందిస్తుందో చూడాలి..

English summary
Ap govt paying rs 8.4 cr per year for controlling rats in Govt hospitals. monthly paying rs 70 lac to contractor. Now this issue became sensational in AP Govt circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X