అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీనిచిన్న చూపు చూడలేదు..పాత మిత్రులు కట్టుకథలు చెబుతున్నారు: గడ్కరీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా వార్ మారుతోంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పసలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. లెక్కలు అడిగితే కక్షసాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతోందనే అసత్య ప్రచారాలు చంద్రబాబు టీమ్ చేస్తోందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. ఏపీలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.

పాత మిత్రులు బీజేపీని విమర్శించడం సరికాదు

పాత మిత్రులు బీజేపీని విమర్శించడం సరికాదు


అన్ని అవసరాలు పొంది తమను తమ పాత మిత్రులు విమర్శించడం సరికాదన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. టీడీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం విమర్శిస్తున్నట్లుగా తాము ఏపీపై ఎలాంటి చిన్న చూపు చూపడం లేదని అన్నారు. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని అయితే ఎక్కడా ఒక్క శాతం కూడా కేంద్రానికి క్రెడిట్ ఇవ్వకుండా అంతా తామే చేస్తున్నామనే బిల్డప్ టీడీపీ ఇస్తోందని గడ్కరీ ధ్వజమెత్తారు. జాతీయత, సుపరిపాలన, పేదరికం నిర్మూలన లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు.

 గోదావరి మిగుల జలాలను తమిళనాడుకు ఇస్తాం

గోదావరి మిగుల జలాలను తమిళనాడుకు ఇస్తాం

కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక రాష్ట్ర స్థితిగతుల్లో మార్పులు వచ్చాయని చెప్పిన గడ్కరీ.... సామాజిక ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలతో సర్వేలు తెప్పించుకోవాలని సూచించారు. ఇక నీటి వనరులపై కూడా గడ్కరీ మాట్లాడారు. గోదావరి కృష్ణ పెన్నా కావేరీ నదులను అనుసంధానం చేస్తామని చెప్పిన ఆయన... సముద్రంలో వృథాగా పోతున్న 1000 టీఎంసీల నీటని సద్వినియోగం చేస్తామని వెల్లడించారు. తమిళనాడు కర్నాటక రాష్ట్రాలు 45 టీఎంసీల నీటికోసం గొడవ పడుతున్నాయని చెప్పిన గడ్కరీ... గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు అందిస్తామని చెప్పారు.

ప్రపంచ టాప్ 20 డైనమిక్ నగరాల్లో భారత్ నుంచి 6: బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్ ప్రపంచ టాప్ 20 డైనమిక్ నగరాల్లో భారత్ నుంచి 6: బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్

ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు

ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు

2014లో ప్రజలు ఎలా అయితే దేశంలో మార్పురావాలని కోరుకున్నారో అదే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయని అన్నారు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఆమె ధ్వజమెత్తారు. పోలవరం తానే కట్టినట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నారని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కృషి దీని వెనక ఉందని ఆమె గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిలా కాకుండా ప్రజాసేవకుడిలా సేవ చేస్తున్నారని ఆమె కొనియాడారు. కేంద్ర పథకాల వల్లే అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పిన పురందరేశ్వరి కేవలం రూ.4వేల కోట్లు రాలేదని సీఎం విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

మతిస్థిమితం లేని నాయకుడు రాష్ట్రానికి అవసరమా..?

మతిస్థిమితం లేని నాయకుడు రాష్ట్రానికి అవసరమా..?


మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్నారు కన్నా. అలాంటి మతిస్థిమితం లేని నాయకుడు రాష్ట్రానికి అవసరం లేదన్న కన్నా లక్ష్మీనారాయణ.... కేంద్ర నిధులు దోచుకుతింటూ బీజేపీనే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రచార కమిటీకి చంద్రబాబును అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందని కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబు బీజేపీతో కలిసి ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.

English summary
AP govt is making baseless allegations on central govt said central Minister Nitin Gadkari. Gadkari who attended a party event in Vijayawada slammed Chandrababu Govt for campaigning lies. He said that Centre gave the required funds but the state government failed to produce the utilisation certificate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X