అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో గంటా చేరిక ముహూర్తం ఖరారు..? సీఎం జగన్ సమక్షంలో రేపే చేరిక

|
Google Oneindia TeluguNews

వైసీపీలోకి మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు చేరిక అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఆయన చేరతారని.. చేరరని... అనుబంధ సభ్యుడిగా కొనసాగుతారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ కాక ఆయన కుమారుడు రవితేజ చేరికపై మాత్రం స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు (శనివారం) రవితేజ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు.

Recommended Video

YCP తీర్థం పుచ్చుకోనున్న గంటా వారు.. రేపే పార్టీ లో చేరిక! || Oneindia Telugu

9 కాదు 16వ తేదీ: వైసీపీలో గంటా చేరికకు తేదీ ఫిక్స్, కండువా కప్పుకోవడంపై ఉత్కంఠ, అనుచరుడిగా..?9 కాదు 16వ తేదీ: వైసీపీలో గంటా చేరికకు తేదీ ఫిక్స్, కండువా కప్పుకోవడంపై ఉత్కంఠ, అనుచరుడిగా..?

గంటా కుమారుడు చేరిక..?

గంటా కుమారుడు చేరిక..?

తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో రవితేజతో పాటు గంటా శ్రీనివాసరావు అనుచరులతో చేరుకుంటారు. సీఎం జగన్‌ను కలిసి ముచ్చటిస్తారు. తర్వాత రవితేజ వైసీపీలో చేరతారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే గంటా మాత్రం అనుబంధ సభ్యుడిగానే కొనసాగుతారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరికపై స్పష్టత లేకుండా పోయింది.

విజయసాయి నిప్పులు..

విజయసాయి నిప్పులు..

గంటా శ్రీనివాస రావుపై వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి గుర్రుమీదున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని ట్వీట్ చేశారు. దానికి మూల్యం తప్పదని కామెంట్ చేశారు. జగన్‌తో విజయసాయికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో విజయసాయి గంటాను బాహాటంగా విమర్శించడం చర్చకు దారితీసింది. అయితే గంటా కాకుండా ఆయన కుమారుడు పార్టీలో చేరడం స్ట్రాటజీ అనే అనుమానాలు కలుగుతున్నాయి.

టీడీపీ-వైసీపీలో ఇలా

టీడీపీ-వైసీపీలో ఇలా

ఇటు టీడీపీలో కూడా గంటా అంటే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పార్టీకి దూరంగా ఉండటంపై గుర్రుమీదున్నారు. ఇదివరకు పార్టీలో చేరే సమయంలోనే.. వీడటం ఎందుకు, ఉండాలని చురకలు అంటించారు. ఇప్పుడు మళ్లీ పార్టీ వీడుతున్నారనే ప్రచారంపై విమర్శిస్తున్నారు. అయితే గంటా మాత్రం టీడీపీలో ఉండలేక.. ఉన్నా విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు వైసీపీలో కూడా అదే పరిస్థితి. విజయసాయి విమర్శలు దీనికి అద్దం పడుతున్నాయి. మొత్తానికి గంటా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
ganta ravi teja to be join ysrcp on oct 3rd october. infront of cm ys jagan mohan reddy in tadepalli camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X