అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ నిబంధ‌న ఉండ‌దిక : ఎంత మంది పిల్లలున్నా అర్హులే : జ‌నాభా పెంచండి..

|
Google Oneindia TeluguNews

జనాభాను పెంచాలన్న ఉద్దేశంతో ఏపి ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణయాల దిశ‌గా అడుగులు వేస్తోంది. అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న యోచన లోనూ ఉంది. దీని కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకి గా ఉన్న నిబంధన ను సైతం తొలిగిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు

ఏపిలో ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని అమ‌ల్లోకి తెస్తోంది. రాష్ట్రంలో జ‌నాభా పెంచాల‌నే ఉద్దేశంతో ప‌లు కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ ఉన్నా... ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల సాధ్యం కావడం లేదని బాధపడుతున్న వారికి అనుకూలంగా ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇకపై జరిగే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల్లో నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించనుంది. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

దీని కోసం ప్రత్యేక విధానాన్ని

దీని కోసం ప్రత్యేక విధానాన్ని

అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న యోచనలోనూ ఉంది. దీని కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. పక్కా ప్రణాళికతో చేపట్టిన దీర్ఘకాలికచర్యలు, మారుతున్న సామాజిక పరిస్థితులతో జనాభా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మరో పది పదిహేనేళ్లు ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో..ఏపి ప్ర‌భుత్వం ముందుగానే ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌టానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ సిద్దం చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు.

ముగ్గురు పిల్ల‌లుంటే ప్రాధాన్యం..

ముగ్గురు పిల్ల‌లుంటే ప్రాధాన్యం..

రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హుల న్న నిబంధన తీసేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. వచ్చే ఎన్నికల నుంచి ఆ షరతులేమీ ఉండవని స్ప‌ష్టం చేసారు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎక్కువ ప్రాధాన్యమిస్తామ‌ని తెలిపారు. అంగన్వాడీల్లో మరింతగా సౌకర్యాలు పెంచే లా చర్యలు తీసుకుంటామ‌ని... చైనా, జపాన్‌, ఐరోపా వంటి దేశాల్లో జనాభా నియంత్రణ వల్ల ఇప్పుడు యువత తగ్గిపోయి... వృద్ధులు ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చిందని వివ‌రించారు. సమాజంలో సమతుల్యత దెబ్బతింటోంద ని.. మన దగ్గరా క్రమంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడ కూడ‌ద‌నే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని సీయం ప్ర‌క‌టించారు.

English summary
Ap Cm call for more birth..more political Chances. He anounced two children limit in panchayat election candidates is removed from this election. He Call for more population in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X