అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో ప్రభుత్వంXప్రభుత్వం: గళమెత్తిన ఎమ్మెల్యేలు, సొంత పార్టీనే ఇరకాటంలో పడేశారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ పైన చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వంగా కనిపించింది. ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. వారి సమాధానాలపై ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఈ ఆసక్తికరమైన సంఘటన గురువారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది.

కూన రవి కుమార్ అభ్యంతరం

కూన రవి కుమార్ అభ్యంతరం

బీసీ సబ్ ప్లాన్ బిల్లు పైన విప్ కూన రవికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా లేక రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ.. జనాభా ప్రాతిపదికన ఇస్తామని తెలిపారు. అయితే అచ్చెన్నాయుడు సమాధానంలో క్లారిటీ లేదని కూన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మరో మంత్రి పితాని సత్యనారాయణ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన టీడీపీ

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన టీడీపీ

బిల్లులో క్లారిటీ లేదని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. మరోవైపు నిధులు ఎంత పర్సంటేజ్ ఇస్తారని కూన రవి కుమార్ పదేపదే ప్రశ్నించారు. మొత్తానికి బీసీ సబ్ ప్లాన్ బిల్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరం ఏమంటే ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వంగా ఉండటం గమనార్హం.

జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?

స్వపక్షంలో విపక్షం

స్వపక్షంలో విపక్షం

ఓ విధంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే విపక్షంలా గళమెత్తారు. దీంతో సభ కాసేపు స్తంభించింది. విప్ రవి కుమార్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. సభలో చర్చ ఉత్కంఠను రేకెత్తించింది. ఓ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు.

English summary
Telugudesam Party MLA Kuna Ravi Kumar questioned AP ministers in Andhra Pradesh Assembly over BC sub plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X