అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలోనే మంత్రి గ‌ళం : ఇంకా అదే గ్యాప్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో కొంత కాలంగా విచిత్ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పై దాడి స‌మ‌యంలో నేరుగా డిజిపి కి ఫోన్ చేసి దాడి పై వాక‌బు చేసారు. గ‌వ‌ర్న‌ర్ నేరుగా డిజిపికి ఫోన్ చేయ‌టాన్ని ముఖ్య‌మంత్రి నిర‌సించారు. అనేక సందర్భాల్లో గ‌వ‌ర్న‌ర్ తీరును ఏపి ప్ర‌భుత్వం ఓపెన్ గానే త‌ప్పు బ‌ట్టింది. ఇక‌, తాజాగా ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల వ్య‌వ‌హారంలో ఏకంగా గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయంతో ఆయ‌న స‌మ‌క్షంలోనే మంత్రి గంటా విబేధించారు. ఇప్పుడు ఇదే ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

నాకున్న వ్యామోహం అదొక్కటే, జిత్తులమారి బాబుతో పాటు వారిపై యుద్ధం: జగన్ నాకున్న వ్యామోహం అదొక్కటే, జిత్తులమారి బాబుతో పాటు వారిపై యుద్ధం: జగన్

అలా అన‌టం నేరం..!

అలా అన‌టం నేరం..!

గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం గా అనేక సంద‌ర్భాల్లో జ‌ర‌గిన ప‌రిణామాలు. ఇప్పుడు తాజాగా గ‌వ‌ర్న‌ర్ స‌మ‌క్షంలోనే ఆయ‌న వాద‌న‌కు వ్య‌తిరేకంగా మంత్రి గ‌ళం. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం స్నాత‌కోత్స‌వ వేడుక‌ల్లో ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. వైద్య రంగంలో ప్రయివేటు ఆస్ప‌త్రుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో..ప్ర‌భుత్వ ఆస్పత్రులు నిర్వీర్యం అయినాయ‌ని..విద్యా రంగంలో ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌ని గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, మంత్రి గంటా మాత్రం వ భిన్నంగా స్పందించారు.

గ‌వ‌ర్న‌ర్

గ‌వ‌ర్న‌ర్

ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల ప్ర‌యివేటు వ‌ర్సిటీల‌తో పోటీ ప‌డాల‌ని వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాన్ని గ‌వ‌ర్న‌ర్ ఖండించారు. అలా అనడం నేరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, వాటితో పోటీ పడి ప్రభుత్వ వర్సిటీలు ఎదగాలని సూచించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ వర్సిటీలు పోటీ పడలేవని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంశం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంకా అదే గ్యాప్‌..

ఇంకా అదే గ్యాప్‌..

రాష్ట్ర విభ‌జ‌న నాటి నుండి గ‌వ‌ర్న‌ర్ - ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ న్ పూర్తిగా తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టిడిపి ప్ర‌భుత్వం ప‌లుమార్లు ఆరోపించింది. ఏపి ప్ర‌భుత్వం పై కేంద్రానికి వ్య‌తిరేక నివేదిక‌లు ఇస్తున్నార‌నేది టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌. తాజాగా, జ‌గ‌న్ పై దాడి స‌మ‌యంలోనూ డిజ‌పికి గ‌వ‌ర్న‌ర్ నేరుగా ఫోన్ చేసి వాక‌బు చేయ‌టం పైనా ముఖ్య‌మంత్రి సీరియ‌స్ అయ్యారు. కేంద్ర ప్ర‌తినిధిగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపి ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ మాత్రం వీటిపై ఎక్క‌డా రియాక్ట్ అవ్వ‌టం లేదు. తన అభిప్రాయాల‌ను నేరుగా ఢిల్లీకి నివేదిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఒకే వేదిక పై గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయానికి వ్య‌తిరేకంగా మంత్రి మాట్లాడ‌టం..మంత్రి వ్యాఖ్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ ఖండించ‌టం చూస్తుంటే..గ‌వ‌ర్న‌ర్ - ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్య ఇంకా అదే గ్యాప్ కంటిన్యూ అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

English summary
Governor vs AP Minister. Gap continues between Governor and AP Govt. Governor cornered minister comments on private universities. Minister does not agree with Governor opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X