అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవితంలో ఒక్క నిజం కూడా చెప్ప‌ని వ్య‌క్తి ఆయ‌నే..! చంద్రబాబు పై ల‌క్ష్మీ పార్వతి ఫైర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చ‌ంద్ర‌బాబు నాయుడు మొత్తం జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పి ఉండ‌ర‌ని, అబ‌ద్దాల‌ను నిజంగా భ్ర‌మింప‌జేస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నాడ‌ని చంద్ర‌బాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిప‌డ్డారు. మంగళవారం లోటస్ పాండ్ లోని విలేకరుల సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడారు. ఏపీలో 40లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు దొరక్క రోడ్డున్న పడ్డారని విమర్శించారు.

మళ్లీ వారణాసి నుంచే బరిలోకి మోదీ : పూరీ నుంచి బరిలోకి దిగరని కమలదళం స్పష్టీకరణ మళ్లీ వారణాసి నుంచే బరిలోకి మోదీ : పూరీ నుంచి బరిలోకి దిగరని కమలదళం స్పష్టీకరణ

ఒక మీడియా సంస్థ ను ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకుని కేసులు బయటకు రాకుండా తనను తాను కాపాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబునాయుడని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా రాష్ట్రానికి చేసిందేమీలేదని, హెరిటేజ్ ను మాత్రం పూర్తి లాభాల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ఓనమాలు రాని లోకేష్ కు స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కొనిచ్చారని విమర్శించారు. లోకేష్ కు క‌నీసం ఇంగ్లీష్ ప‌రిజ్ఞానంతో పాటు తెలుగు కూడా స్ప‌ష్టంగా మాట్లాడ‌టం రాద‌ని ల‌క్షీపార్వ‌తి ఎద్దేవా చేసారు.

He is the one who does not tell you the truth in life..! Lakshmi Parvati Fire on Chandrababu .. !!

నిన్న మాట్లాడింది చూస్తే తన చదువు గురించి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చేసి పీహెచ్ డీ చేసీ ఎంఫీల్ పూర్తి చేసినానని చెబుతున్నారని, అది బీకాంలో ఫిజిక్స్ అని చెప్పినట్టుగా ఉందని అన్నారు. చంద్రబాబుకు ఫేస్ వ్యాల్యూవ్ లేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కబ్జా చేశాడని విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడని, ఆయన ప్రాణాలు తీసాడని విమర్శించారు.

రాష్ట్రానికి పేరుతెచ్చిన ఒక్క విషయమైనా చెప్పమనండని ప్రశ్నించారు. 9ఏండ్లు పరిపాలించినప్పుడు కూడా 40ప్రభుత్వ రంగ సంస్థలు మూసేయించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో 3000కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని 60వేల కోట్లకు దిగజార్చారన్నారు. ఐటీ కంపెనీలను తీసుకువచ్చినట్టు చెబుతున్నారని ఆ సమయంలో పక్కరాష్ట్రాల్లో ఐటీ మన రాష్ట్రంలో కంటే బాగుండేదని తెలిపారు.

English summary
ycp leader laxmi parvathi fires on ap cm chandrababu naidu. She said that about 40 lakh unemployed people in AP were hit by roads. Chandrababu is a man who has established a media company and has established a special judiciary and protects him from getting out of the cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X