అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితులకు వేధింపులు, శిరోముండన ఘటనపై సీఎం జగన్ సీరియస్.. తప్పు చేస్తే వదలబోం..

|
Google Oneindia TeluguNews

దళిత యువకుడు శిరోముండన ఘటనలో ఎవరూ తప్పుచేసిన తప్పేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. దళిత యువకుడిపై శిరోముండన ఘటనపై స్పందించారు. హక్కుల, చర్యలపై కానిస్టేబుళ్లు, ఏఎస్సై, ఎస్సైలకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

హోం మంత్రి దళిత్, డీజీపీ ఎస్టీ..

హోం మంత్రి దళిత్, డీజీపీ ఎస్టీ..


హోం మంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు అని జగన్ స్పష్టంచేశారు. డీజీపీ ఎస్టీ అని.. బడుగు బలహీనవర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని.. వారి హక్కుల రక్షణ పోలీసు శాఖదేనని స్పష్టంచేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ అతీతులు కాదు అని జగన్ తేల్చిచెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దళితులపై దాడులు, ఇతర ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఎంతటివారినైనా.. వదలబోం...

ఎంతటివారినైనా.. వదలబోం...

తప్పు చేస్తే ఎస్సైను పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఘటన గతంలో జరగలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. తప్పు చేసింది సీఐ అయినా.. ఎస్సై అయినా... అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇలాంటి ఘటన జరిగిన సమయంలో బంధువులే బాధితులైతే ఉపేక్షిస్తామా అని పోలీసు అధికారులను ప్రశ్నించారు. కానిస్టేబుళ్లు, ఏఎస్సై, ఎస్సైలు ప్రజల హక్కులపై ఎలా స్పందించాలనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ గతనెలలో అడ్డుకున్నారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడమే గాక.. శిరోముండనం చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. వెంటనే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ తనకు న్యాయం జరగలేదని వరప్రసాద్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. మాజీ సర్పంచ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు అని.. తననే సూటి పోటీ మాటలు అంటున్నారని ప్రసాద్ చెప్పారు.

Recommended Video

Motkupalli Narasimhulu Warns Ysrcp Goverment
రాష్ట్రపతికి లేఖ రాయడంతో...

రాష్ట్రపతికి లేఖ రాయడంతో...


నక్సలైట్లలో కలవాలని నిర్ణయం తీసుకున్నానని రాష్ట్రపతికి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో విచారణ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో దళితులపై దాడులు, శిరోముండనం ఘటనలపై ఉపేక్షించబోమని సీఎం జగన్ స్పష్టంచేశారు.

English summary
someone misbehave to dalits, they will be punish, cm jagan mohan reddy clarified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X