• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ అలా.. కేసీఆర్ ఇలా.. ప్రతిపక్షంపై చెరో దారి..!

|
  కేసీఆర్,జగన్ మద్య భిన్న అభిప్రాయాలు || Different Opinions Between KCR And Jagan About Opposition

  అమరావతి : ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రతిపక్షానికి కూడా అటో ఇటో అలాంటి బాధ్యతే ఉంటుంది. ప్రజా సమస్యలపై గొంతెత్తి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాల్సి వస్తుంది. కానీ, కొన్నిచోట్ల ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయనే వాదనలు లేకపోలేదు.

  అలాంటి క్రమంలో తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది. ఆ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కిస్తూ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా జరిగిన ప్రయత్నాలు తెలిసిందే. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విషయంలో హుందాగా వ్యవహరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

  అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!

  ఓ ఐదుగురిని లాగేస్తే పోలా.. ఆ సూచనల్ని తిరస్కరించా..!

  ఓ ఐదుగురిని లాగేస్తే పోలా.. ఆ సూచనల్ని తిరస్కరించా..!

  అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే తీరులో తనకు కొందరు సూచనలు చేసినా.. వాటిని పట్టించుకోలేదన్నారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలుండగా.. అందులో ఓ ఐదుగురిని లాగేస్తే సభలో అపొజిషన్ లేకుండా చేయొచ్చనే ప్రతిపాదనలను తిరస్కరించినట్లు చెప్పారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశం తనకు లేదని.. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయించాలి లేదంటే అనర్హత వేటు పడేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుని అలాంటి తప్పులు చేయకుండా మార్గదర్శకంగా నిలవాలని అన్నారు.

  ప్రతిపక్ష సభ్యులకు సభలో పూర్తి స్వేచ్ఛ.. మాట్లాడనిద్దాం..!

  ప్రతిపక్ష సభ్యులకు సభలో పూర్తి స్వేచ్ఛ.. మాట్లాడనిద్దాం..!

  గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు సరైన ప్రాతినిధ్యం దొరకలేదన్నారు జగన్. మాట్లాడుతుండగానే మైకులు కట్ చేసేవారని గుర్తు చేశారు. అయితే అలాంటి సభ నిర్వహణకు చెక్ పెట్టేలా.. ఇకపై సభను హుందాగా నడిపించుకుందామని అన్నారు. వాళ్లు తప్పులు చేశారు.. మనం కూడా అదే బాటలో వెళ్లడం సమంజసం కాదన్నారు. సభ మర్యాద కాపాడుతూ.. వాళ్లకు, మనకు ఉన్న తేడా ఏంటో చూపిద్దామన్నారు.

  వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు పూర్తిస్థాయిలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రతిపక్ష సభ్యులు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత.. ప్రభుత్వం సమాధానం చెప్పగలిగితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. సభ మర్యాద పెరగాలంటే అబద్దాలు చెప్పొద్దని సూచించారు. ప్రతిపక్షం ఉండాల్సిందేనని.. ఎవరైనా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలోకి రావాలనుకుంటే వారితో రాజీనామా చేయించి.. మన గుర్తుతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలిచిన తర్వాతే మన ఎమ్మెల్యే అవుతారని చెప్పుకొచ్చారు.

  జగన్ ఇలా.. కేసీఆర్ అలా.. ప్రతిపక్షంపై భిన్న వైఖరి

  జగన్ ఇలా.. కేసీఆర్ అలా.. ప్రతిపక్షంపై భిన్న వైఖరి

  అసెంబ్లీలో ప్రతిపక్షం విషయానికొస్తే ఏపీ సీఎం జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం బాగా పనిచేయగలదని జగన్ నమ్ముతుంటే.. మరి కేసీఆర్ అపొజిషన్ లేకుండా చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అనే టాక్ నడుస్తోంది.

  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కక్షసాధింపో.. ఏమో గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాత్రం కేసీఆర్ చాలా చనువుగా ఉంటున్నారు. అలాంటి క్రమంలో ప్రతిపక్షం విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరు, కేసీఆర్ వైఖరి భిన్నంగా ఉండటం చర్చానీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిణామాలతో మొత్తానికి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సరైన ప్రాధాన్యత దక్కనుండటం విశేషం.

  కేసీఆర్ నీరో చక్రవర్తి.. బండి సంజయ్ ఏకిపారేశారుగా.. పార్లమెంట్‌లో తొలి స్పీచ్

  నియంతృత్వ వైఖరి మంచిది కాదు.. ప్రతిపక్షం ఉంటేనే బెటర్

  నియంతృత్వ వైఖరి మంచిది కాదు.. ప్రతిపక్షం ఉంటేనే బెటర్

  తెలంగాణ అసెంబ్లీలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనే టీఆర్ఎస్ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నియంత పాలన సరికాదనే వాదనలు తెరపైకి వచ్చాయి. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం గొంతెత్తినే ప్రభుత్వ పాలనలోని లొసుగులేంటో తెలుస్తాయనేది అపొజిషన్ లీడర్ల మాట. కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో సభ మర్యాద గంగలో కలిసిపోతుందనే వారు లేకపోలేదు. ప్రతిపక్షం ఉంటేనే సభకు హుందాతనమని.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రతిపక్షమే నిలబడాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు కొందరు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయడమనేది ప్రజాస్వామ్యానికి చేటు అంటున్నారు మరికొందరు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  If the opposition is in the assembly house is better says andhra pradesh cm ys jaganmohan reddy. At the same time telangana cm KCR wants to make no opposition in the house.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more