• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్‌కు షాక్ : వైసీపీలోకి స్టార్ కమెడియన్ అలీ... ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?

|

వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే ప్రమఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీలు వైసీపీలో చేరగా... ఇక తాజాగా మరో సీనియర్ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మధ్యనే అలీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసినట్లు సమాచారం. అప్పుడే తను వైసీపీలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

  Comedian Ali Leaves Pawan Kalyan & Joins In YSRCP? | Oneindia Telugu
  వైసీపీ కండువా కప్పుకోనున్న కమెడియన్ అలీ

  వైసీపీ కండువా కప్పుకోనున్న కమెడియన్ అలీ

  వెండితెరపై నవ్వులు పూయించిన ప్రముఖ కమెడియన్ అలీ త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఓ వైపు నటుడిగా రాణిస్తూ మరోవైపు రాజకీయాల్లోను అలీ అడపాదడపా కనిపిస్తున్నారు. ఇక సినిమాల్లో బ్రహ్మానందం తర్వాత అలీదే తదుపరి స్థానం అని చెప్పొచ్చు. 2014లో అలీ తెలుగుదేశం పార్టీలోకి వెళతారని జోరుగా వార్తలు షికారు చేశాయి. గుంటూరు లేదా రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు గాలివార్తలులానే మిగిలిపోయాయి. తాజాగా అలీ వైసీపీ చేరుతున్నట్లు అధికారిక సమాచారం అందింది. ఈనెల 9న ఇఛ్చాపురంలో వైసీపీ అధినేత జగన్ పాద్రయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అలీ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

  జనసేనలో చేరతారని భావించిన వారికి అలీ ట్విస్ట్

  జనసేనలో చేరతారని భావించిన వారికి అలీ ట్విస్ట్

  అలీ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పగానే అందరూ జనసేనలోకి వెళతారని భావించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీతో అలీకి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన జనసేనలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలీ మాత్రం దానిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ మంచి పాత్రను పోషించారు. అంతేకాదు తన సినిమాలో అలీ లేకుంటే ఏదో వెలితి ఉంటుందని పాత్ర ఉన్నా లేకపోయినప్పటికీ అలీ కోసమే ఓ ప్రత్యేక పాత్ర సృష్టిస్తామని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. అలీ అంటే తనకు ఒక రకమైన సెంటిమెంటు అని చెప్పేవారు. ఇక జనసేన పార్టీ పెట్టగానే అలీ అందులో చేరతారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు పార్టీ పెట్టాక పవన్ నెల్లూరులోని బారా షహీద్ దర్గాను పరామర్శించిన సమయంలో అలీ పవన్ వెంటే ఉన్నారు. దీంతో అలీ జనసేనలో చేరడం ఖాయమనే వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

  రాజమండ్రి నుంచి అలీ పోటీ చేస్తారా...?

  రాజమండ్రి నుంచి అలీ పోటీ చేస్తారా...?

  తాజాగా అలీ వైసీపీలో చేరడంపై ఇటు సినీవర్గాలు అటు పొలిటికల్ సర్కిల్స్‌‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి వైసీపీ జనసేన పార్టీలు ఒకరికొకకు సహకరించుకోవాల్సి వస్తే వారి మధ్య అలీ వారధిగా పనిచేసే అవకాశం కూడా లేకపోలేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇందుకు కారణం పవన్‌తో అలీకి ఉన్న సానిహిత్యమే అని వారు చెబుతున్నారు. ఇక అలీ వైసీపీకి వస్తే ఆ పార్టీకి ముస్లిం మైనార్టీల బలం కూడా చేకూరుతుందని భావిస్తున్నారు. ఇటు అభిమానుల అండ, అటు ముస్లిం సామాజిక వర్గం తోడైతే వైసీపీకి మరింత ప్లస్ కానుంది. ఇక పోటీ విషయానికొస్తే అలీ పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగుతారా లేక మరే ప్రాంతం నుంచైనా పోటీ చేస్తారా అనేదానిపై కాలమే సమాధానం చెప్పాలి.

  ఇప్పటికే అక్కినేని నాగార్జున వైసీపీలో చేరుతారని ఓ వార్త వినిపిస్తోంది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ కూడా వైసీపీలోనే కొనసాగుతోంది. మొత్తానికి అలీ చేరికతో వైసీపీలో మరింత సినీ గ్లామర్ పెరిగిందనే చెప్పాలి.

  English summary
  Tollywood star comedian Ali is all set to join YSRCP.Well news is making rounds that this star comedian will join the party in the presence of YCP Chief Jagan Reddy on the last day of his ongoing padayatra. Ali is said to be a close aid of Janasena chief Pawan Kalyan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X