అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ఆర్ సీపీ లోక్ స‌భ అభ్య‌ర్థులు వీరేనా?..21 స్థానాల‌పై స్ప‌ష్ట‌త

|
Google Oneindia TeluguNews

అమరావ‌తిః ఎన్నిక‌ల ముంగిట్లో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. భారీగా చేరిక‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గడువు స‌మీపిస్తుండటంతో వైఎస్ఆర్ సీపీలోకి వ‌ల‌స వ‌చ్చే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం సంద‌డిగా మారింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి దాస‌రి జైర‌మేష్‌, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వంటి కీల‌క నేత‌లు కూడా ప్ర‌తిప‌క్షంలో చేర‌డం వైఎస్ఆర్ సీపీలో నూత‌నోత్తేజాన్ని నింపుతోంది. నోటిఫికేష‌న్ వెలువడేలోగా మ‌రిన్ని చేరిక‌లు ఉండొచ్చ‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కొత్త‌గా వ‌చ్చిన వారిని కూడా దృష్టిలో ఉంచుకుని, అభ్య‌ర్థుల జాబితాను రూపొందిస్తున్నారు వైఎస్ఆర్ సీపీ అధి నాయ‌కులు.

 ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని

విజ‌య‌వాడ నుంచి దాసరి, గుంటూరుకు మోదుగుల‌..

విజ‌య‌వాడ నుంచి దాసరి, గుంటూరుకు మోదుగుల‌..

రాష్ట్రంలో 25 లోక్ స‌భ స్థానాలు ఉండ‌గా.. సుమారు 21 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ముందుగా ఊహించిన‌ట్లే విజ‌య‌వాడ లోక్ స‌భ బ‌రిలో తెలుగుదేశం ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థ‌పాకుల్లో ఒక‌రైన దాస‌రి జైర‌మేష్ ను దింప‌బోతున్నారు. టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే అవ‌కాశం ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని ఢీ కొట్ట‌గ‌లిగే స‌మ‌ర్థ‌త జైర‌మేష్ కు మాత్ర‌మే ఉంద‌ని పార్టీ విశ్వ‌సిస్తోంది. కొద్దిరోజుల కింద‌టే వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా లోక్‌స‌భ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌బోతున్నారు. ఆయ‌న‌కు గుంటూరు లేదా న‌ర‌స‌రావు పేటల్లో ఒక‌దాన్ని కేటాయిస్తారు. 2009 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మోదుగుల టీడీపీ అభ్యర్థిగా న‌ర‌స‌రావు పేట లోక్ స‌భ స్థానం నుంచి ఎన్నిక‌య్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయ‌న‌కు అదే స్థానాన్ని కేటాయించే అవ‌కాశాలు లేక‌పోలేదు. గుంటూరు సీటునే కేటాయించాల్సి వ‌స్తే.. ప్ర‌స్తుతం అక్క‌డ‌ లోక్ స‌భ ఇన్‌ఛార్జిగా ఉన్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లును న‌ర‌స‌రావు పేట అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

జేసీపై మీసం తిప్పిన మాజీ పోలీస్‌కు లోక్ స‌భ టికెట్

జేసీపై మీసం తిప్పిన మాజీ పోలీస్‌కు లోక్ స‌భ టికెట్

మీసం తిప్పి, జేసీ దివాక‌ర్ రెడ్డికి స‌వాలు విసిరి, రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ ఎస్ఐ గోరంట్ల మాధ‌వ్ కూడా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు. ఆయ‌న‌కు అనంత‌పురం జిల్లా హిందూపురం లోక్ స‌భ స్థానాన్ని కేటాయించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ స్థానం టీడీపీ చేతిలో ఉంది. నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఇక్క‌డ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అనంత‌పురం జిల్లాలో బ‌ల‌మైన ఓటుబ్యాంకుగా ఉన్న కురుబ కులానికి చెందిన గోరంట్ల మాధ‌వ్ ను హిందూపురంలో లోక్‌స‌భ రేసులో నిలిపితే విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయం ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ ఇవ్వ‌డానికి వైఎస్ఆర్ సీపీ నాయ‌క‌త్వం సిద్ధంగా ఉంది. ఆయ‌న పార్టీలో చేరితే ఒంగోలు లోక్ స‌భ టికెట్ ఇస్తామ‌ని ఇదివ‌ర‌కే సంకేతాలు పంపించింది.

తిరుప‌తి సిట్టింగ్ ఎంపీ.. ఈ సారి అసెంబ్లీకిః విజ‌య‌న‌గ‌రం నుంచి బొత్స ఝాన్సీ

తిరుప‌తి సిట్టింగ్ ఎంపీ.. ఈ సారి అసెంబ్లీకిః విజ‌య‌న‌గ‌రం నుంచి బొత్స ఝాన్సీ

2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన వ‌ర‌ప్ర‌సాద్ ను ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని నెల్లూరుజిల్లా గూడూరు అసెంబ్లీ టికెట్‌ను ఆయ‌న‌కు ఇస్తార‌ని స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ సీపీ త‌ర‌ఫున గూడూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పాశం సునీల్ కుమార్ పార్టీ ఫిరాయించిన విష‌యం తెలిసిందే. దీనితో ఆ సీటును వ‌ర‌ప్ర‌సాద్‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. తిరుప‌తి లోక్ స‌భ అభ్య‌ర్థిత్వం కోసం కొత్త నాయ‌కుడిని అన్వేషిస్తోంది వైఎస్ఆర్ సీపీ. విజ‌య‌న‌గ‌రం లోక్ స‌భ స్థానాన్ని బొత్స స‌త్య‌నారాయ‌ణ భార్య బొత్స ఝాన్సీకి కేటాయించారు. గ‌తంలో ఆమె ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అభ్య‌ర్థుల జాబితా ఇదీ..

శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం - బొత్స ఝాన్సీ, విశాఖ - ఎంవివి చౌదరి, అనకాపల్లి - వరద కల్యాణి, అరకు - గొట్టేటి మాధవి,
కాకినాడ - బలిజి అశోక్, రాజమండ్రి - మార్గాని భరత్, అమలాపురం- చింతా అనురాధ, నరసాపురం - రఘురామ కృష్ణంరాజు, ఏలూరు - కోటగిరి శ్రీధర్, విజయవాడ - దాసరి జై రమేష్, మచిలిపట్నం - బాల‌శౌరీ, గుంటూరు లేదా న‌ర‌స‌రావుపేట‌-మోదుగుల వేణుగోపాలరెడ్డి, నరసరావు పేట లేదా గుంటూరు- శ్రీ కృష్ణ దేవరాయలు, ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు - మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట - మిథున్ రెడ్డి, కడప - అవినాష్ రెడ్డి, హిందూపూరం - గోరంట్ల మాధవ్, అనంతపురం - పిడి రంగయ్య, నంద్యాల - శిల్పా రవిచంద్ర.
బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు స్థానాల‌పై ఇంకా క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది.

బాప‌ట్ల లోక్ స‌భ స్థానం ఆమె కోస‌మేనా?

బాప‌ట్ల లోక్ స‌భ స్థానం ఆమె కోస‌మేనా?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక లక్ష్మీ కోసం వైఎస్ఆర్ సీపీ నాయ‌క‌త్వం సంప్ర‌దింపులు నిర్వ‌హిస్తోంది. ఆమె పార్టీలో చేరిత‌.. బాప‌ట్ల లోక్ స‌భ స్థానాన్ని కేటాయిస్తార‌ని చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ఆ స్థానానికి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కు ప‌న‌బాక ల‌క్ష్మీ బాప‌ట్ల నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. పార్టీకి అతీతంగా ఆమెకు నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టిప‌ట్టు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. వైఎస్ఆర్ సీపీ ప‌న‌బాక కోసం సంప్ర‌దింపులు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

English summary
Opposition Party in Andhra Pradesh assembly YSR Congress Party all set to fight against Telugu Desam in upcoming Lok Sabha elections. Party top cadre all most finalized the list of 21 Lok Sabha candidates out of 25. Tirupati, Chittoor, Bapatla, Kurnool Lok Sabha constituency are still pending for the candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X