అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా : ఆ ఆరోప‌ణ‌లు నిరాధారం: 35 మంది కాదు..ఇద్ద‌రే..!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. డీఎస్పీ ప్ర‌మోష‌న్ల లో ఏ సామాజిక‌వ‌ర్గం వారు ఎంత మంది ఉన్నార‌నే లెక్క‌ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

35 మంది కాదు..ఇద్ద‌రే

35 మంది కాదు..ఇద్ద‌రే

వైసిపి అధినేత జ‌గ‌న్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి రాష్ట్రంలో పోలీసు అధికారుల పై ఫిర్యాదు చేసారు. అదే స‌మ యంలో ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఏ ర‌కంగా ప్రాధాన్య‌త ఇస్తుందీ వివ‌రించారు. అందులో భాగం గా 37 మంది డీఎస్పీల‌కు ప్ర‌మోష‌న్లు ఇస్తే అందులో సీయం సామాజిక వ‌ర్గానికి చెందిన వారు 35 మంది ఉన్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అయితే, ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఈ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చాయి. డీఎస్పీ ప్రమోషన్లలో బీసీలకు పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నాయి. ఆ ప్రకారం 2014 ఫిబ్రవరి రెండో తేదీ వరకూ ప్రమోషన్‌ ప్యానల్‌లో ఉన్న 21 మందికి ఇప్పటికే డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో దళితులు అత్యధికంగా ఏడుగురు, బీసీలు ఐదుగురు, ఎస్టీలు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురు, ఇతర ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు.

డిజిపి తో స‌హా ఆ ముగ్గురినీ త‌ప్పించండి:ఒకే వ‌ర్గానికి పోస్టింగ్‌లు: బాబు 4 వేల కోట్లు సిద్దం చేసారు డిజిపి తో స‌హా ఆ ముగ్గురినీ త‌ప్పించండి:ఒకే వ‌ర్గానికి పోస్టింగ్‌లు: బాబు 4 వేల కోట్లు సిద్దం చేసారు

2018 ప్యాన‌ల్ లో ఈ విధంగా..

2018 ప్యాన‌ల్ లో ఈ విధంగా..

ఇక‌, 2018 సంవత్సరం వరకూ ప్యానల్‌ను ఆమోదిస్తే రెగ్యులర్‌ డీఎస్పీలుగా ప్రమోషన్‌ పొందబోయే వారు మరో 35 మం ది ఉన్నారు. వీరు ప్రస్తుతం సూపర్‌ న్యూమరీ పోస్టుల్లో డీఎస్పీలుగా ఉన్నారు. వీరి విషయంలోనే జగన్‌ ఆరోపణలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో బీసీలు తొమ్మిది మంది, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏడుగు రు, దళితులు ఏడుగురు, బలిజ, కాపు సామాజిక వర్గీయులు నలుగురు, ముస్లింలు ఇద్దరు, కమ్మ సామాజిక వర్గానికి చెం దిన ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ప్రమోషన్లు అందుకోబోతున్నారు. శాఖాపరంగా కసరత్తు చేశాకే ప్రమోషన్లు జరుగుతాయని, ప్రభుత్వం తలదూర్చదని ఆ వర్గాలు తెలిపాయి. ఇదే స‌మ‌యం లో పోలీసు అధికారుల సంఘం జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది.

జ‌గ‌న్ పై సీయం ఫైర్‌..

జ‌గ‌న్ పై సీయం ఫైర్‌..

కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనిని నీచాతినీచమైన చర్యగా అభివర్ణించారు. తన పార్టీలో, ప్రభుత్వంలో అన్ని కులాలూ ఉన్నా యని.. జగన్‌ ఒక కులానికి వంతపాడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కులాలకు, అధికారుల కు సంబంధమేంటని ప్ర‌శ్నించారు. మంత్రుల్లో నలుగురు రెడ్లు ఉన్నారు. ఏకులానికి అన్యాయం జరిగిందని ప్ర‌శ్నిం చారు. సామాజిక న్యాయం చేయడంలో ముందుంటాన‌ని స్పష్టం చేశారు. ఆంధ్రలో వేడుకగా జరుగుతున్న పింఛన్లు, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ భగ్నానికి కూడా జగన్‌ కుట్ర పన్నారని, శాడిజంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసీపీ సైకో పార్టీగా మారిందిని విమ‌ర్శించారు. అయితే, జ‌గ‌న్ కు వ‌చ్చిన స‌మాచారం ఏ ర‌కంగా సేక‌రించిందీ.. ఏ లిస్టు ను ఉద్దేశించి చెప్పారో ఇప్పుడు వైసిపి శ్రేణులు వివ‌రించాల్సి న ప‌రిస్థితి ఏర్ప‌డింది.

English summary
AP Govt seriously reacted on Jagan comments on DSP promotion in AP. Jagan say that only one caste shich belongs to AP Cm is giving priority in DSP promotions before elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X