అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్ కు జ‌గ‌న్ : 10 రోజుల ప‌ర్య‌ట‌న : అనుమ‌తిచ్చిన కోర్టు

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ లండ‌న్ లోని త‌న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. గత నెల‌లోనే జ‌గ‌న్ లండ‌న్ వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే, రాజ‌కీయంగా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టే ముందు జగ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల నున్నారు. వ‌చ్చే వారం ఆయ‌న లండ‌న్ వెళ్ల‌నున్నారు.

Jagan for London tour : CBI court pemitted

10 రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌..
వైసిపి అధినేత జ‌గ‌న్ లండన్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో అనుమతిచ్చింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ సంస్థలో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ ఆయన పిటిషన్‌ వేశారు. దీంతో ఈనెల 18 నుంచి మార్చి 15వ తేదీ మధ్య 10 రోజులపాటు ఆయన లండన్ లో పర్యటించేలా.. ఏడాది కాలపరిమితికి పాస్‌పోర్టు జారీచేయాలని పాస్‌పోర్టు అధికారులను కోర్టు ఆదేశించింది. లండ న్‌లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ ఫోన్‌, సెల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ నంబర్‌ తదితర వివరాలను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని షరతు పెట్టింది. దీంతో.. గ‌త నెల‌లోనే లండ‌న్ వెళ్లాల్సి ఉన్నా..అప్పుడు రాజ కీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారం భించే ముందే ఆయ‌న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు.

ఆ త‌రువాతే అభ్యర్దుల ప్ర‌క‌ట‌న‌..
ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీ అభ్య‌ర్దుల విష‌యంలో జ‌న‌గ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు. అయితే, ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చే కీల‌క నేత‌ల వ్య‌వ‌హారంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రు వ‌స్తార‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వస్తే ఇక అభ్య‌ర్దుల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ నెలాఖ‌రు లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడ‌ద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. దీంతో.. ఈ లోగానే లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకొని ఆ వెంట‌నే అభ్య‌ర్దుల ను ప్ర‌క‌టించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు.

English summary
CBI court permitte YCP Chief Jagan London Tour for 10 days. Before election schedule jagan want to visit his daughter who studying in London. Court given permission between 18th february to 15th March jagan may visit London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X