అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి నేత‌లంద‌రికీ ఆహ్వానం : ఆ రోజే అభ్య‌ర్ధుల ఖ‌రారు..!: ఆశావాహుల్లో టెన్ష‌న్‌..!

|
Google Oneindia TeluguNews

పాద‌యాత్ర ముగుస్తున్న స‌మ‌యాన వైసిపి అధినేత జ‌గ‌న్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. 14 నెల‌ల‌కు పైగా దాదాపు 4000 కిలో మీట‌ర్లు పైగా సాగుతున్న పాద‌యాత్ర జ‌న‌వ‌రి 9న ఇచ్ఛాపురం లో ముగియ‌నుంది. పాద‌యాత్ర ముగింపు కు భారీ ఫినిషింగ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ అదే సంద‌ర్భంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని పార్టీ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ సమాచారం..

పాద‌యాత్ర గుర్తుండి పోయేలా..

2017 న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ‌లో ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో 13 జిల్లాల్లో కొన‌సా గించి చివ‌ర‌గా ఈ నెల 9న ఇచ్ఛాపురం లో ముగియ‌నుంది. అదే రోజు పార్టీ ఎమ్మెల్యేలు..ఇన్‌ఛార్జ్‌లు..పార్ల‌ మెంట్ తాజా మాజీ స‌భ్యులు అంద‌రూ హాజ‌రు కావాల‌ని పార్టీ నుండి పిలుపు వ‌చ్చింది. చివ‌రి రోజున ఇచ్ఛాపురం లో పార్టీ భారీ బ‌హి రంగ స‌భ‌కు రంగం సిద్దం అవుతోంది. ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర ముగింపు గుర్తుకు పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు.

Jagan may announce party Candidates in Padayatra Conclude meeting..

ఆ స‌భ‌తో పాటుగా పాద‌యాత్ర గుర్తిండిపోయేలా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం ఆ స‌భ వేదిగా జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా గురించి ఢిల్లీలో సైతం వైసిపి నిర‌స‌న దీక్ష చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ ఆ స‌భ‌లో ఏపి కి ప్ర‌త్యేక హోదా అంశంతో పాటుగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఆ ముగింపు స‌భా వేదిక‌గానే...ఎన్నిల‌కు స‌మ‌ర శంఖం పూరిస్తార‌ని తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌ను అక్క‌డికి ర‌మ్మ‌ని ఆహ్వానించ‌టం ద్వారా..పార్టీ ప‌రంగా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఇక ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌టంతో..ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు సైతం ఉంటాయ‌ని చెబుతున్నారు..

అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌కు క‌స‌ర‌త్తు..

ఇచ్ఛాపురంలో జ‌రిగే పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ ఓ సంచ‌ల‌నం చేయ‌బోతున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతు న్నారు. ఇప్ప‌టికే ఏపిలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పరిస్థితి..సామాజిక స‌మీక‌ర‌ణాలు..పోటీలో ఉన్న అభ్య‌ర్ధులు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని జ‌గ‌న్ ప‌లు కోణాల్లో స‌ర్వేలు చేయించారు. ఆ స‌ర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా కొన్ని చోట్ల పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చారు. అవి కొన్ని చోట్ల వివాదాల‌కు దారి తీసినా..వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఇచ్ఛాపురం స‌భ ద్వారా పార్టీ నుండి టిక్కెట్లు ద‌క్కించుకొనే వారి పేర్లు ప్ర‌క‌టిస్తార‌ని అంచనా వేస్తున్నారు.

ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లే చాలా చోట్ల ఆభ్య‌ర్ధులుగా ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో..వారి పేర్ల‌ను ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. అదే విధంగా లోక్‌స‌భ స‌భ్యుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్న స‌మాచారం. టిడిపి నుండి వైసిపి లో చేరేందుకు సిద్దంగా ఉన్న నేత‌ల‌కు సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ఏం చేస్తార‌నేది చూడాలి. అయితే, ఇప్ప‌టికే టిడిపి అధినేత సైతం జ‌న‌వ‌రి చివ‌రిలోగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. దీంతో.. ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చాపురం వేదిక‌గా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి..కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేస్తార‌ని తెలుస్తోంది. దీంతో..వైసిపి ఆశావాహుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది...

English summary
YS jagan padayatra conclude on January 9th At Ichapuram in Srikakulam dist. Jagan may anounce big decision on Special status. And also party leaders expecting Jagan anounce Party Candidates for 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X