అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్ర‌..రాష్ట్ర పెద్ద‌లు అందులో పిహెచ్‌డి : దిగ‌జారుడు త‌నం : గుణ‌పాఠం త‌ప్ప‌దు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Elections 2019 : Jagan Reacted On Central Budget And Central Govt Attitude On AP| Oneindia Telugu

కేంద్ర బ‌డ్జెట్ పై వైసిపి అధినేత జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేసారు. నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాల కు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నారని జగన్‌ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ఉంద‌న్నారు..

ఇద్ద‌రూ ఇద్ద‌రే..

ఇద్ద‌రూ ఇద్ద‌రే..

కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ స్పందించారు. ముఖ్యమం త్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ అని జ‌గ‌న్ దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని పేర్కొన్నారు.

చంద్రబాబుఫై జగన్‌ మండిపడ్డారు.

చంద్రబాబుఫై జగన్‌ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడని గుర్తు చేశారు. ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్లచొక్కాలతో వస్తే.. మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈరోజు చంద్రబాబు నల్లచొక్కాలు వేసు కొచ్చారని జగన్‌ మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.
ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు తమ ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారని, ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి తనకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని జగన్‌ గుర్తు చేశారు. ఈరోజు ఎవరూ లేకుండా చూసి అసెంబ్లీలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుణ‌పాఠం త‌ప్ప‌దు..

గుణ‌పాఠం త‌ప్ప‌దు..

నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్‌మీట్‌ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసింద ని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్‌ను కూడా చంద్రబాబు గాని, కేంద్రంలోని ఆయన మంత్రులు గానీ వ్యతిరేకించ లేదని గుర్తు చేసారు. విశాఖ మెట్రో రైల్‌కు రూ.1 లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూ డా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్‌ అకౌం ట్‌ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్ది గా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పదు అని జగన్ టిడిపి - బిజెపి ల‌ను హెచ్చరించారు.

English summary
YCP Chief Jagan fire on Central and State govt's. Jagan reacted on Central budget and seriously reacted on Central Govt attitude on AP. He says in coming elections public teach lesson for these parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X