అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

341 రోజులు : 3,648 కిలో మీట‌ర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న పైనే దృష్ట

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఘ‌న‌మైన ముగింపు ఇవ్వ‌టానికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌గ‌న్ అభిమానులకి చిర కాలం గుర్తుండిపోయేలా ముగింపు స‌భ సిద్ద‌మ‌వుతోంది. ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర ముగింపుకు గుర్తుగా భారీ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎన్నో ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. ఇక‌, ఇదే స‌భ ద్వారా జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ అభిమానుల్లో ముగింపు స‌భ పై ఆస‌క్తి పెరుగుతోంది.

రికార్డు పాద‌యాత్ర ... ప్ర‌తీక‌గా భారీ స్థూపం..

రికార్డు పాద‌యాత్ర ... ప్ర‌తీక‌గా భారీ స్థూపం..

వైసిపి అధినేత జ‌గ‌న్ 2017 న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ నుండి ప్రారంభ‌మైంది. తొలుత ఇది ఆరు నెల‌ల పాటు మూడు వేల కిలో మీట‌ర్లు సాగేలా యాత్ర షెడ్యూల్ ఖ‌రారు చేసారు. అయితే, అనుకున్న స‌మ‌యం కంటే మ‌రో ఎనిమి ది నెల‌లు ఆల‌స్యంగా పాద‌యాత్ర ముగియ‌నుంది. జ‌న‌వ‌రి 9న ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర ముగుస్తోంది. అప్ప‌టికి జ‌గ‌న్ మొత్తంగా 341 రోజుల పాటు 3,648 కిలో మీట‌ర్లు యాత్ర చేసిన వ్య‌క్తిగా రికార్డు సృష్టించారు. గ‌తంలో వైయ‌స్‌. టిడిపి అధినేత చంద్ర‌బాబు, జ‌గ‌న్ సోదీరి ష‌ర్మిళ సైతం పాద‌యాత్ర‌లు చేసారు.

కానీ, ఇంత దూరం న‌డించింది మాత్రం జ‌గ‌న్ ఒక్క‌రే. ఇక‌, ఇచ్ఛాపురంలో జ‌రిగే పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు పార్టీ నేత‌లంతా త‌ర‌లి రావాల‌ని ఇప్ప‌టి కే పార్టీ పిలుపునిచ్చింది. అదే స‌మ‌యంలో..పాద‌యాత్ర కు గుర్తింపు గా ఇచ్ఛాపురంలో నిర్మిస్తున్న స్థూపం సైతం అనేక ప్ర‌త్యేక‌త‌లు సంత‌రించుకుంది. స్థూపం చివరి అంతస్తు డోమ్‌ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని పెడుతున్నారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్రహరీగోడపైన పాదయాత్ర విశేషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా : చ‌ంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..! జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా : చ‌ంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..!

అభిమానుల‌కు చిర కాలం గుర్తుండిపోయేలా..

అభిమానుల‌కు చిర కాలం గుర్తుండిపోయేలా..

జ‌గ‌న్ పాద‌యాత్ర చిర‌కాలం అభిమానుల్లో గుర్తుండి పోయేలా ముగింపు స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం యాత్ర సంక‌ల్పాన్ని చాటుతూ స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన పార్టీ పూర్తిచేస్తోంది. శ్రీకాకుళంనుంచి ఇచ్ఛాపురం వెళ్తు న్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడమవైపున, అటువైపు బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున, బహుదానది తీరాన ఈస్థూపం రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛాపురం టౌన్‌కు 2 కిలోమీటర్ల ముందే ఈ స్థూపం కనిపి స్తుంది. పాదయాత్ర చివరిరోజున వైఎస్‌ జగన్‌ ఈ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు.

ఇప్పటికే వైయస్సార్ ప్ర‌జా ప్ర‌స్థానం యా త్ర కు గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. ఆతర్వాత వైయస్‌ షర్మిళ నిర్వ‌హించిన మ‌రో ప్రజా ప్రస్థా నం కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా మరో స్థూపాన్ని కట్టారు. ఇప్పుడు జ‌గ‌న్ యాత్ర ముగింపు కు గుర్తు గా ఈ స్థూపం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తుల లెక్కన, పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్‌ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉం టుంది. మొదటి అంతస్తులో వైయస్‌జగన్‌ పాదయాత్ర ఫొటోలు ఉంటాయి. రెండో అంతస్తులో వైయస్సార్‌ ఫొటోలు ఉంటాయి. చివరి అంతస్తు వృత్తాకార ఆకృతిలో ఉంటుంది.

జ‌గ‌న్ ప్ర‌సంగం..ప్ర‌క‌ట‌న పైనే ఆస‌క్తి..!

జ‌గ‌న్ ప్ర‌సంగం..ప్ర‌క‌ట‌న పైనే ఆస‌క్తి..!

జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో మొత్తం 134 నియోజ‌క వ‌ర్గాలు క‌వ‌ర్ చేసారు. అందులో భాగంగా 2,516 గ్రామాలు, 231 మండ లాలు, 54 మున్సిపాల్టీలు, 8 కార్పోరేష‌న్ల మీదుగా ఈ యాత్ర సాగింది. ఇక‌, యాత్ర‌లో మొత్తం 124 బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఇక‌, 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో పాల్గొన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగం పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ స‌భ ద్వారా జ‌గ‌న్ కీల‌క సందేశం ఇస్తార‌ని..ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీంతో..జ‌గ‌న్ అభ్య‌ర్ధుల‌ను ఏమైనా ప్ర‌క‌టిస్తారా..లేక ప్ర‌త్యేక హోదా పై మ‌లి విడ‌త పోరాట కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేస్తారా అనే చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే ఢిల్లీలో జ‌గ‌న్ ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ఆమ‌ర‌ణ దీక్ష కు దిగుతున్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. పాద‌యాత్ర ముగింపు స‌భ ద్వారా..వ‌చ్చే ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ పూర్తి స్థాయి లో స‌మ‌ర శంకం పూరిస్తార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

English summary
YS Jagan pada Yatra come to an end. On january 9th at Ichapuram Jagan conclude his Yatra. Party leaders arranging pylon in Ichapuram. In closing meeting jagan may announce key decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X