అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ్యోతుల నెహ్రూకు చెక్ : జ‌గ్గంపేట పై తోట గురి : చ‌ంద్ర‌బాబు..ఒక‌రిని వ‌దులుకోవాల్సిందేనా..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..టిడిపి లో సీట్ల పంచాయితీలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు.. ముగ్గురు సిట్టంగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇదే స‌మ‌యంలో తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట పంచాయితీ ఇప్పుడు సీయం వ‌ద్ద‌కు చేరింది. ఇద్ద‌రు ముఖ్యులు ఒకే సీటు కోరుతున్నారు. ఎవ‌రిని కాద‌న్నా..మ‌రొక‌రు పార్టీ వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి.. ముఖ్య‌మంత్రి ఏం చేస్తారు..

జ‌గ్గంపేట సీటు కావాలి...

జ‌గ్గంపేట సీటు కావాలి...

లోక్‌స‌భ‌లో టిడిపి శాస‌న‌స‌భా ప‌క్ష నేత తోట న‌ర‌సింహం కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌కు జ‌గ్గంపేట అసెంబ్లీ సీటు ఇవ్వాల ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రిని క‌లిసారు. ముఖ్య‌మంత్రి ఆలోచ‌న చేస్తాన‌ని హామీ ఇచ్చారు. తోట న ర్సింహం 2004 లో టిడిపి అభ్య‌ర్దిగా పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ మీద గెలుపొందారు. 2009 లోనూ కాంగ్రెస్ అభ్యర్దిగా ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ పై మ‌రోసారి గెలిచారు. 2009 లో గెలిచిన త‌రువాత మంత్రిగానూ ప‌ని చేసారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపిలో చేరి కాకినాడ లోక్‌స‌భ‌కు పోటీ చేసి గెలిచారు. ఆ త‌రువాత లోక్‌స‌భ టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న శ్రీమ‌తికి జ‌గ్గంపేట సీటు ఇవ్వాల‌ని సీయం ను అభ్య‌ర్దించారు.

జ్యోతుల నెహ్రూకు చెక్‌...

జ్యోతుల నెహ్రూకు చెక్‌...

జ‌గ్గంపేట లో 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలిచిన జ్యోతుల నెహ్రూ కొద్ది కాలం క్రితం టిడిపిలోకి ఫిరాయించారు. త న కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట నుండి త‌న‌కు టిడిపి సీటు ఖాయ‌మ‌నే భావ‌న‌లో నెహ్రూ ఉన్నారు. జ‌గ్గంపేట నుండి నెహ్రూ టిడిపి అభ్య‌ర్దిగా 1994,1999 లో వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు. 2004 లో ఓడిపోయారు. 2009 లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసి ఓడారు. 2014 లో వైసిపి నుండి మూడోసారి గెలుపొందారు. వైసిపి ప్ర‌తిప‌క్షంలో రాగా, ఆయ‌న‌ను శాస‌న‌స‌భా ప‌క్ష ఉప నేత‌గా నియ‌మించారు. ఆయ‌న జ‌గ్గంపేట లో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆయ‌న పై 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన జ్యోతుల చంటిబాబు వైసిపి లో చేరారు. దీంతో..ఈ సారి త‌న‌కు టిడిపి సీటు ఖాయ‌మ‌ని వ‌చ్చే ఎన్ని క‌ల్లో పోటీ కి నెహ్రూ స‌మాయ‌త్తం అవుతున్నారు.

ఒక‌రిని వ‌దులుకోవాల్సిందేనా..

ఒక‌రిని వ‌దులుకోవాల్సిందేనా..

ఇప్ప‌టికే తోట న‌ర్సింహం వైసిపి తో ట‌చ్ లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, న‌ర్సింహం ఆ వార్త‌ల‌ను ఖం డించారు. తాను టిడిపిలో నే ఉంటాన‌ని చెబుతున్నారు. అయితే త‌న కుటుంబంలో ఒక‌రికి సీటు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టు బ‌డుతున్నారు. ప‌రోక్షంగా సీటు ఇవ్వ‌క‌పోతే త‌న నిర్ణ‌యం తాను తీసుకుంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పేసారు. ఇక‌,ఇదే స‌మ‌యంలో జ్యోతుల నెహ్రూకు సీటు ఇవ్వ‌క‌పోతే ఆయ‌న సైతం టిడిపిని కాద‌ని..జ‌న‌సేన వైపు చూసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. గ‌తంలో ప్ర‌జారాజ్యం లో ప‌ని చేయ‌టంతో ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్ తో స‌త్సంబంధాలే ఉన్నాయి. దీంతో..ఇప్పుడు జ‌గ్గంపేట సీటు ఇద్ద‌రు డిమాండ్ చేస్తుండ‌టంతో.. వీరిలో ఎవ‌రిని ఏ సీటుకు స‌ర్దుబాటు చేయాలనే మీమాంస లో ముఖ్య‌మంత్రి ఉన్నారు. ఇద్ద‌రిలో ఒక‌రికి ఈ సీటు ఇస్తే..మ‌రొక‌రు పార్టీ వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి..ముఖ్య‌మంత్రి ఈ సీటు విష‌యంలో ఏం చేస్తారో అనే ఉత్కంఠ క‌నిపిస్తోంది.

English summary
TDP Loksabha floor leader met party chief Chandra babu and asked accomidate Jaggampet Assembly seat for his family memebers. Due to illness he not willing to contest in upcoming elections. From Jaggampet sitting Mla Jyothula Nehru expecting seat in once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X