• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌న‌సేన అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల‌: 4 లోక్‌స‌భ‌..32 అసెంబ్లీ స్థానాల‌కు ..!

|
  Janasena Chief Pawan Kalyan Announced Party Candidates First List | Oneindia Telugu

  ఏపిలో ఎన్నిక‌ల్లో పోటీ చేసే తొలి జాబితాను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ విడుద‌ల చేసారు. అధికారికంగా అభ్య‌ర్ధు ల‌ను ప్ర‌క‌టించిన తొలి పార్టీ జ‌న‌సేన‌. ఈ రోజు పార్టీ అవిర్భావ దినోత్స‌వం కావ‌టంతో..స‌భ‌కు ముందుగానే అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా సుదీర్ఘ క‌స‌ర‌త్తు త‌రువాత జాబితా విడుద‌ల చేసారు. అందులో భాగంగా 4 లోక్‌సభ, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

  *వణక్కం రాహుల్ గాంధీ* హ్యాష్ ట్యాగ్... యువతలో ఏ మాత్రం తగ్గని రాహుల్ క్రేజ్

  నాలుగు లోక్‌స‌భ స్థానాల‌కు..

  నాలుగు లోక్‌స‌భ స్థానాల‌కు..

  జ‌న‌సేన నుండి పోటీ చేసే లోక్‌స‌భ అభ్య‌ర్ధుల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. నాలుగు స్థానాలను ఖ‌రారు చేసారు. అందులో

  అమలాపురం- డీఎంఆర్‌ శేఖర్‌, రాజమండ్రి - ఆకుల సత్యనారాయణ, విశాఖపట్నం- గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి- చింతల పార్థసారథి కి అవ‌కాశం ఇచ్చారు. మిగిలిన స్థానాల‌కు ఒక‌టి రెండు రోజుల్లో ప్ర‌క‌టిస్తారని తెలుస్తోంది.

  ఎమ్మెల్యేగా అభ్య‌ర్ధులుగా..

  ఎమ్మెల్యేగా అభ్య‌ర్ధులుగా..

  జ‌న‌సేన నుండి నుండి పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను జ‌న‌సేన ప్ర‌క‌టించింది. అందులో కొంద‌రిని గ‌తంలోనే ప‌వ‌న్ ఖ‌రారు చేసారు. ప‌వ‌న్ ప్ర‌క‌టించిన శాసనసభ అభ్యర్థులు జాబితాలో .. యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్‌,

  పాయకరావుపేట- నక్కా రాజబాబు, పాడేరు- పసుపులేటి బాలరాజు, రాజాం- ముచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు, పలాస- కోత పూర్ణచంద్రరావు, ఎచ్చెర్ల- బాడన వెంకట జనార్దన్‌(జనా), నెల్లిమర్ల- లోకం నాగమాధవి,

  తుని- రాజా అశోక్‌బాబు, రాజమండ్రి సిటీ- కందుల దుర్గేశ్‌, రాజోలు- రాపాక వరప్రసాద్‌, పి.గన్నవరం- పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ- ముత్తా శశిధర్‌, అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు, ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ, మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు- నవుడు వెంకటరమణ, ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు, తెనాలి- నాదెండ్ల మనోహర్‌, గుంటూరు వెస్ట్‌- తోట చంద్రశేఖర్‌, ప్రత్తిపాడు- రావెల కిశోర్‌బాబు,

  వేమూరు- ఏ. భరత్‌ భూషణ్‌, నరసరావుపేట- సయ్యద్‌ జిలాని, కావలి- పసుపులేటి సుధాకర్‌, నెల్లూరు రూరల్‌- చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి, ఆదోని- మల్లికార్జునరావు(మల్లప్ప), ధర్మవరం- మధుసూదన్‌రెడ్డి, రాజంపేట- పత్తిపాటి కుసుమకుమారి, రైల్వేకోడూరు- బోనాసి వెంకటసుబ్బయ్య, పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్‌, మచిలీపట్నం- బండి రామకృష్ణ పేర్ల‌ను ప్ర‌క‌టించారు.

  స‌మీక‌ర‌ణాలే ఆధారంగా..

  స‌మీక‌ర‌ణాలే ఆధారంగా..

  జ‌న‌సేన అన తొలి జాబితాలో అన్ని స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకున్నారు. ప్ర‌ధానంగా అభ్య‌ర్ధుల గుణ గ‌ణాల ఆధారంగా ఎంపిక జ‌రిగింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ రోజు రాజ‌మండ్రి లో జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ త‌రువాత ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల ఎంపిక పైనా దృష్టి సారించ‌నున్నారు. 16న వామ‌ప‌క్ష నేత‌లోత స‌మావేశ‌మై పొత్తు లో భాగంగా కేటాయించే స్థానాల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ఆ త‌రువాత మిగిలి న స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Janasena Chief Pawan Kalyan announced party candidates first list. Four loksabha and 32 assembly candidates list released by pawan Kalyan. Pending list may be announced on 16th or 17th of this month.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more