అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసీఆర్ డేటా చోరీ..ఓట్లు తొలిగించారు : ఈసి స‌హ‌క‌రించింది: బాబు ల‌క్ష్యంగానే: శివాజీ సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

డేటా చోరీ వ్య‌వ‌హారం పై సినీ న‌టుడు శివాజీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ లో అక్క‌డి ఎన్నిక‌ల ముందు కేసీఆర్ డేటా చోరీ చేసార‌ని..ఆయ‌న‌కు ఎన్నిక‌ల సంఘం స‌హ‌క‌రించింద‌ని శివాజీ ఆరోపించారు. అక్క‌డి ఏపి ప్ర‌జ‌ల ఓట్లు తొలిగించారని చెప్పుకొచ్చారు. ఐటి గ్రిడ్స్ కేసులో ఏమీ లేద‌ని..చంద్ర‌బాబు ను ఎల‌క్ష‌నీరింగ్ చేసుకోకుండా ఉం చేందుకే ఈ క‌ధ న‌డుస్తోంద‌ని పేర్కొన్నారు.

ఎర్రబెల్లికి ఏపీ మంత్రులు టచ్ లో ఉన్నారా ? ఆ విషయం వారే చెప్పారా ? ఎర్రబెల్లికి ఏపీ మంత్రులు టచ్ లో ఉన్నారా ? ఆ విషయం వారే చెప్పారా ?

అక్క‌డి డేటా చోరీ చేసారు

అక్క‌డి డేటా చోరీ చేసారు

తెలంగాణ ప్ర‌భుత్వం అక్క‌డి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు సమగ్ర సర్వేను తెలంగాణ ప్రభుత్వం పార్టీ కోసం వాడు కుందని, దీనికి ఈసి సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిం చి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారని శివాజీ ఆరోపించారు. కేసీఆర్ అధికా రంలోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను తన పార్టీకి అనుకూలంగా కేసీఆర్ వాడుకున్నా రని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని.. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు. ఈసీ వద్ద నుంచి ఆధార్‌ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి ఓట్లను తొలగించారుని ఆరోపించారు

ఎన్నిక‌ల సంఘం స‌హ‌క‌రించింది..

ఎన్నిక‌ల సంఘం స‌హ‌క‌రించింది..

గ్రేటర్‌ పరిధిలో 40 లక్షలకు పైగా సెటిలర్లు ఉన్నారని... ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేశారని... సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారని గుర్తు చేసారు. ఎస్‌ఆర్‌డీహెచ్‌ అప్లికేషన్‌ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసి.. అప్లికేషన్‌ కోసం టెండర్లు కూడా పిలిచారన్నారు. ఈసీ, సీఎస్‌, గ్రేటర్‌ కమిషనర్‌ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారని వివ‌రించారు. డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసారు. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్‌కుమార్‌ వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు సహకరించారు. మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి. కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయింది. అదే తరహాలో ఏపీపై కేసీఆర్‌ గురిపెట్టారుని శివాజీ చెప్పుకొచ్చారు.

టిడిపికి ఓడించేందుకే..

టిడిపికి ఓడించేందుకే..

ఏపిలో టిడిపిని ఓడించేందుకే ఎన్నిక‌ల వేళ ఐటి గ్రిడ్స్ అంశాన్ని తెర మీద‌కు తెచ్చార‌ని శివాజీ ఆరోపించారు. బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా సైతం త‌మ పార్టీ ముఖ్య‌మంత్రుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ల‌బ్దిదారుల వివ‌రాల‌ను తీసుకురా వాల‌ని సూచించార‌ని చెప్పుకొచ్చారు. బిజెపి వినియోగించే న‌మో యాప్ లో 90 కోట్ల మంది డేటా ఉంద‌న్నారు. ఏపిలో నూ టిడిపి వ్య‌తిరేక ఓట్లు తొలిగించేందుకు ఈ ప్ర‌యత్నాలు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. హోదా..రైల్వే జోన్ అం శాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకే ఇలా చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ హైద‌రాబాద్ బ్రాండ్ వాల్యూను త‌గ్గిస్తున్నార‌ని ఆరో పించారు. చంద్ర‌బాబు ను ఓడించ‌ట‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ ఇక్క‌డ పావులు క‌దుపుతున్నార‌ని పేర్కొన్నారు.

English summary
Cine hero Sivaji sensational comments on Telangana govt and elections commission. Sivaji says before Telangana elections Kcr and Elections commission deleted votes who are against TRS. Sivaji said that KCR theft Govt data and with EC help. To damage Chandra Babu KCR Govt started IT Grids issue. BJp also using 90 cr voters data in NAMO aap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X