అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాల‌న్నారు : అందుకే జ‌గ‌న్ తో భేటీ..!

|
Google Oneindia TeluguNews

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు..జ‌గ‌న్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్య‌మంత్రి..టిడిపి అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. బీజేపి అజెండా అమ‌లు చేసేందుకే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అని సీయం వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వా లని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు.

బీజేపి అజెండానే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌

బీజేపి అజెండానే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి చేస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల పై టిడిపి అధినేత చంద్ర‌బాబు మొద‌లు.,పార్టీ నేత లంతా ఫైర్ అవుతున్నారు. అది మోదీకి స‌హ‌క‌రించే ఫ్రంట్ అని విమ‌ర్శిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్ర జరుగుతుందని చంద్ర‌బాబు అనుమానం వ్య‌క్తం చేసారు. బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తు న్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజావ్యతిరేక చర్యలపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందన్నారు. అసహనం కప్పెట్టేందుకే కుట్రలకు తెరదీశారని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపి అజెండా అమ‌లు చేసేందుకే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అని సీయం ఆరోపించారు. ఇప్ప‌టికే కెసీఆర్ - జ‌గ‌న్‌-మోదీ క‌లిసి ఏపి పై కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్న ముఖ్య‌మంత్రి తాజా గా టిఆర్‌య‌స్ - వైసిపి భేటీ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

 స్పంద‌న లేకే...ముసుగు తొలిగిపోయింది...

స్పంద‌న లేకే...ముసుగు తొలిగిపోయింది...

కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన లేదని...అందుకే హడావుడిగా నిన్న జగన్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారని ఏపి ముఖ్య‌మంత్రి అన్నారు. ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందని పేర్కొన్నారు. తెలంగా న ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ -ప‌వ‌న్ ఇద్ద‌రూ కేసీఆర్ కు స‌హ‌క‌రించే క్ర‌మంలో భాగంగానే అక్క‌డ పోటీ చేయ‌టం లేద‌ని టిడిపి నేత‌లు విమ‌ర్శించారు. తెలంగాణ‌లో టిఆర్‌య‌స్ విజ‌యం త‌రువాత ఏపిలో వైసిపి నేత‌లు సంబ‌రాలు చేసుకోవ‌టం పైనా టిడిపి నేత‌లు ప‌లు ఆరోప‌ణ‌లు చేసారు. కేసీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ ప్ర‌త్య‌క హోదా తెస్తానంటున్నారు .. ముసుగులో ఎందుకు గుద్దులాట‌.. ఇద్దరూ క‌లిసే ఎన్నిక‌ల్లో పోటీ చేయండి అంటూ సీయం వ్యాఖ్యానించారు. జాతీ య స్థాయిలో చంద్ర‌బాబు కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూట‌మి లో పార్టీల మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తుంటే..కేసీఆర్ మాత్రం నాన్ కాంగ్రెస్‌..నాన్ బిజెపి పార్టీల కూట‌మి కోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ప‌తాక స్థాయికి చేరింది.

హోదా త‌మ‌కూ ఇవ్వాల‌న్నారు..

హోదా త‌మ‌కూ ఇవ్వాల‌న్నారు..

ఏపికి ప్ర‌త్యేక హోదా కు కేసీఆర్ అడ్డు ప‌డుతున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శించిన చంద్ర‌బాబు మ‌రోసారి అదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్ 9, షెడ్యూ ల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని సీఎం చంద్రబా బు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ - జ‌గ‌న్ భేటీ స‌మ‌యం నుండి ఏపి టిడిపి నేత‌లు వ‌రుస‌గా విమ‌ర్శ ల ప‌ర్వం ప్రారంభించారు. ఏపికి అన్యాయం చేసిన కేసీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ ఏపికి ద్రోహం చేస్తున్నార‌ని ఆరోపంచారు. టిడిపి నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. వైసిపి నేత‌లు మాత్రం కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నారు. రానున్న రోజుల్లో ఈ విమ‌ర్శ‌లు మ‌రింత తీవ్ర స్థాయికి చేరే అవ‌కాశాలు క‌నిపిస్తోంది.

English summary
AP C.M Chandra Babu fire on Jagan - Ktr meet on Federal Front. He says Federal front is in favour for Modi. For anti government votes division KCR planning for Federal Front..says MR Chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X