అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ల‌గ‌డ‌పాటి మ‌రో స‌ర్వే ఇస్తారు : స‌రి చేసుకుంటారు : టిఆర్‌య‌స్ చెబుతున్న సంచ‌ల‌న విష‌యాలివే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Exit Polls Survey 2018 : Lagadapati May Give Post Poll Survey To Favour Of TRS | Oneindia

ఆంధ్రా ఆక్టోప‌స్ తెలంగాణ ఎన్నిక‌ల స‌ర్వే ను టిఆర్‌య‌స్ న‌మ్మ‌టం లేదు. ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే..అనేక విష‌యాలు ఆ పార్టీ నేత‌లు విశ్లేషిస్తున్నారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు గ‌తంలో ఏవి నిజ‌మైనాయి..ఏవి త‌ప్ప‌యినాయ‌నే విష‌యం ప‌క్క‌న పెడితే అ స‌లు తెలంగాణ ఫ‌లితాల్లో మాత్రం లోపాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. జాతీయ మీడియా మొత్తం టిఆర్‌య‌స్ కు మ‌ద్ద‌తుగా ఫలితాల‌ను ప్ర‌క‌టించాయి. కానీ, ల‌గ‌డ‌పాటి మాత్రం వారి స‌ర్వేలు త‌ప్ప‌వుతాయ‌ని..త‌న‌ది మాత్ర‌మే నిజ‌మ‌ని గ‌ట్ట‌గా చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో టిఆర్‌య‌స్ నేత‌లు చెబుతున్న విష‌యాలు మ‌రింత ఆసక్తి క‌లిగిస్తున్నాయి. ఇదే ల‌గ‌డ‌పాటి ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు రోజు మ‌రో స‌ర్వే త‌ప్ప‌క ఇవ్వ‌ని ప‌రిస్థితి ఉందంటున్నారు టిఆర్‌య‌స్ నేత‌లు...

అస‌లు ఎగ్జిట్ పోల్ నిర్వ‌హించారా..టిఆర్‌య‌స్ అనుమానం..

అస‌లు ఎగ్జిట్ పోల్ నిర్వ‌హించారా..టిఆర్‌య‌స్ అనుమానం..

ఉత్కంఠ భ‌రితంగా మారిన తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాల పై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అన్ని స‌ర్వేల‌కు విరుద్దంగా ల‌గ‌డ‌పాటి చెబుతున్న ఫ‌లితాల విశ్లేష‌ణ‌లో అనేక లోపాలు ఉన్నాయ‌ని టిఆర్‌య‌స్ నేత‌లు చెబుతున్నారు. అస‌లు..ల‌గ‌డ‌పాటి చెబుతున్న విధంగా ఆర్‌జి ఫ్లాష్ టీం అస‌లు ఎగ్జిట్ పోల్ చేసిందా అనే అనుమానం టిఆర్‌య‌స నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు చెప్ప‌టం ముందే తెలంగా ణ‌లో 72 శాతం పోలింగ్ జ‌రిగింద‌ని..మ‌రో రెండు నుండి మూడు శాతం పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నిక‌ల్లో మొత్తం పోలింగ్ శాత‌మే 69.1 కా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. దీంతో.. ల‌గ‌డ‌పాటి చెప్పిన దాని కంటే దా దాపు 4 నుండి అయిదు శాతం తేడా క‌నిపిస్తోంది. ఇది..ఫ‌లితాల‌ను తారు మారు చేసే స్థాయిలో ఉంటుంద‌ని టిఆర్‌య‌స్ నేత‌ల విశ్లేష‌ణ‌. ఏపిలో కేవ‌లం 1.95 శాతం ఓట్ల తేడాతో టిడిపికి 102, టిఆర్‌య‌స్ కు 67 సీట్లు వ‌చ్చిన విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి త‌న విశ్లేష‌ణ చెప్పే స‌మ‌యంలో ఆయ‌న మొహం లో ఎక్క‌డా కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ స‌రైన విధంగా క‌నిపించ‌లేద‌ని టిఆర్‌య‌స్ నేత‌ల అభిప్రాయం.

స‌ర్వే లెక్క‌ల్లో ఈ ప్ల‌స్ లు...మైన‌స్ ల‌పై సందేహాలు..

స‌ర్వే లెక్క‌ల్లో ఈ ప్ల‌స్ లు...మైన‌స్ ల‌పై సందేహాలు..

ల‌గ‌డ‌పాటి గ‌తంలో చెప్పిన లెక్క‌లు చాలాసార్లు క‌రెక్ట్ అయ్యాయి. ఎప్పుడూ అంకెల‌తో స‌హా ఖ‌చ్చితంగా ఫ‌లితాలు చెప్పే ల‌గ‌డ‌పాటి తెలంగాణ ఫ‌లితాల్లో మాత్రం ప్ల‌స్ లు..మైన‌స్ లు అంటూ తానే ఎంత గంద‌రగోళం లో ఉందో తానే స్ప‌ష్టం చేసార‌ని టిఆర్ య‌స్ నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్యాఖ్యానిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి కాంగ్రెస్ కు 156 సీట్లు వ‌స్తాయ‌ని..33 ఎంపి సీట్లు వ‌స్తాయ‌ని అంకెల‌తో స‌హా చెప్పిన లెక్క‌లు ఖ‌చ్చితంగా ప్ర‌తిభింభించాయి. అదే విధంగా నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితాల్లోనూ టిడిపి దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంద‌ని చెప్పారు. అదే విధం గా 27 వేల ఓట్ల మెజార్టీతో టిడిపి గెలిచింది. కానీ, నాలుగు రోజుల క్రితం తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌జా కూట‌మి కే అధిక్యం వ‌స్తుంద‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి..చివ‌రి రెండు రోజుల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని వివ‌రించారు. క్షేత్ర స్థాయిలో అనేక ప‌రిణామాలు మార్పు చేసుకున్న మాట నిజ‌మేన‌ని...అదే విధంగా.. టిఆర్‌య‌స్ కు అనుకూలంగా మారిన విష‌యం ల‌గ‌డ‌పాటి ఉద్దేశ‌పూర్వ‌కంగా విస్మ‌రిస్తున్నార‌ని టిఆర్‌య‌స్ నేత‌ల విమ‌ర్శ‌. ఉత్త‌రాది మీడియా కు ద‌క్షిణాది ఓట‌ర్ల నాడి తెలియ‌దంటున్న ల‌గ‌డ‌పాటి..తాను మాత్రం గ‌తంలో స‌ర్వేల మాదిరి..ఖ‌చ్చితంగా ఎందుకు చెప్పలేక పోతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు టిఆర్‌య‌స్ నేత‌లు..

ఫ‌లితాల ముందే..ల‌గ‌డ‌పాటి మ‌రో స‌ర్వే త‌ప్ప‌దా..!

ఫ‌లితాల ముందే..ల‌గ‌డ‌పాటి మ‌రో స‌ర్వే త‌ప్ప‌దా..!

తాను ముందు చెప్పిన లెక్క‌ల‌కు వెన‌క్కు తీసుకోలేక‌..దానికి కొన‌సాగింపుగానే ల‌గ‌డ‌పాటి త‌న ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల‌ను
విశ్లేషించారని టిఆర్‌య‌స్ నేత‌లు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఎప్పుడూ ఖ‌చ్చితంగా సీట్ల సంఖ్య‌తో పాటుగా ఫ‌లితాల‌ను విశ్లేషించే ల‌గ‌డ‌పాటి ఈ సారి త‌డ‌బ‌డ‌ట‌మే కాకుండా.. పోస్ట్ పోల్ స‌ర్వే సైతం చేస్తాన‌ని చెప్ప‌టం ద్వారా త‌న సర్వే పై త‌న‌కే న‌మ్మ‌కం లేద‌నే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పోస్ట్ పోల్ స‌ర్వే ద్వారా ల‌గ‌డ‌పాటి త‌న లెక్క‌ల‌ను స‌రి చేసుకుంటార‌ని టిఆర్‌య‌స్ నేత‌ల అంచ‌నా. 11వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డి కానుండ‌టంతో..ముందు రోజే ల‌గ‌డ‌పాటి మ‌రో సారి త‌న పోస్ట్ పోల్ స‌ర్వేను బ‌ట‌య పెడ‌తార‌ని..ఆ సంద‌ర్భంలోనే త‌న స‌ర్వేను స‌రిచేసుకొని..టిఆర్‌య‌స్ కు అనుకూల‌గా ఫ‌లితాలు వెల్ల‌డిస్తార‌ని టిఆర్‌య‌స్ నేత‌లు అంచ‌నా వేస్తు న్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ముందు ల‌గ‌డ‌పాటి బ‌య‌ట‌పెట్టిన స‌ర్వే విష‌యాల పై కెసిఆర్‌..కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సూచించారు. ఇప్పుడు ఫ‌లితాల త‌రువాత టిఆర్‌య‌స్ - ల‌గ‌డ‌పాటి మ‌ధ్య నెంబ‌ర్ గేమ్ న‌డుస్తోంది. మ‌రి..టిఆర్‌య‌స్ అంచ‌నాలు నిజ‌మవుతాయో..లేక ల‌గ‌డ‌పాటి లెక్క‌లు నిజ‌మ‌వుతాయో 11వ తేదీన తేల‌నుంది..

English summary
TRS not believing Lagadapati Survey. TRS expressing many doubts on Lagadapati survey. TRS expecting another survey form Lagadapati on Post poll survey... In that survey Lagadapati may in favour of TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X