అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగుల‌కు చ‌ద‌ర‌పు గ‌జం 5 వేలు : ఈషా ఫౌండేష‌న్ కు ఎక‌రం 10 ల‌క్ష‌లు..

|
Google Oneindia TeluguNews

ఏపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి లో కొత్త‌గా భూములు కేటాయిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో ఏపి లో ప‌ని చేస్తున్న హైకోర్టు న్యాయ‌మూర్తుల మొద‌లు ఉద్యోగుల వ‌ర‌కూ ఉన్నారు. వారి కోం సీఆర్డీయే 238 ఎక‌రాలు కేటాయి స్తూ ప్ర‌క‌ట‌న చేసింది. వీరంద‌రికీ అభివృద్ది చేసిన లే అవుట్ల‌లోనే ఇంటి స్థ‌లాలు ఇవ్వ‌నున్నారు.

అమ‌రాతిలో ఇళ్ల స్థ‌లాల కేటాయింపు ఏపి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి స్థ‌లాల కేటాయింపు పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించింది. ఏపి హైకోర్టు న్యాయ‌మూర్తులు..స‌చివాల‌య ప‌రిధిలో ప‌ని చేసే అఖిల భార‌త స‌ర్వీస్ అధికారులు..హెచ్ఓడీలు..

Lands Allotment in Amravati : Sub Committee fixed rates..

ఉద్యోగుల ఇళ్ల స్థ‌లాల కోసం 238 ఎక‌రాలు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. వీరికి ధ‌ర‌లు కూడా ఖ‌రారు చేసారు. హైకోర్టు జడ్జిలకు చదరపు గజం రూ.5వేల చొప్పున 750 చదరపు గజాలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులకు రూ.5వేల చొప్పున 500 చ.గ., ఎన్జీవోలకు రూ.4వేల చొప్పున 175 చ.గ., గజిటెడ్‌ అధికారులకు రూ.4,500 చొప్పున 200 చ.గ. కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో కొన్ని సంస్థ‌ల‌కు సైతం త‌క్కువ ధ‌ర‌ల‌కే భూములు కేటాయింపు చేస్తూ నిర్ణ‌యించారు.

అమ‌రావ‌తిలో ఉద్యోగుల తో పాటుగా కొన్ని పేరున్న సేవా సంస్థ‌ల‌కు సైతం క్యాబినెట్ స‌బ్ క‌మిటీ భూములు కేటా యింపుకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా.. ఈషా ఫౌండేషన్‌కు ఎకరం రూ.10లక్షల చొప్పున 10 ఎకరాలు, చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు 3 ఎకరాలు రాజధాని వెలుపల ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. వీటితో సీఆర్డీయే పరిధిలో ఇప్పటి వరకూ 1636 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయింపులు చేసారు.

English summary
Ap Govt alloted lands for Civil service officers and emlpoyees in Amaravati. Govt fix cost for alloted lands. Cabinet sub committe recomanded for lands to service organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X