అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కోరుకున్నదే జరుగుతోందా : అటు సీబీఐ..ఇటు ఈడీ : టార్గెట్ టీడీపీ..వారు చిక్కుకుంటారా..!!

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఏం కోరుకున్నారో..ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తరువాత అదే జరుగుతోంది. తన చేతికి మసి అంటకుండా జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటికే హై కోర్టు ఆదేశాల మేరకు పల్నాడు మైనింగ్ అక్రమాల పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా అగ్రిగోల్డ్ విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అగ్రి గోల్ద్ వ్యవహారంలో టీడీపీ కీలక నేతలు ఉన్నారని ..దీని పైన సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ డిమాండ్ చేసింది.

అయితే, ఇప్పుడు తాజాగా హైకోర్టులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పిటీషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. ఇందులోనూ టీడీపీ నేతల ప్రమేయం ఉందనేది వైసీపీ ఆరోపణ. దీంతో..అక్కడ సీబీఐ..ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగితే టీడీపీ పెద్ద చేపలు చిక్కుతాయనే ఏపీ ప్రభుత్వం అంచనా. అయితే, తాము కక్ష్య సాధింపు చర్యలు దిగుతున్నామనే భావన రాకుండా..ఈ రకంగా పని ముగించాలని భావిస్తోంది. మరి..ఈ విచారణల్లో వైసీపీ అంచనా వేస్తున్న ట్లుగా టీడీపీ నేతలు చిక్కుతారా..

కలెక్టర్‌కు రూ. కోటి, గ్రామ సచివాలయాల్లో హెల్ప్‌లైన్: జగన్ సమీక్ష సాగిందిలా..కలెక్టర్‌కు రూ. కోటి, గ్రామ సచివాలయాల్లో హెల్ప్‌లైన్: జగన్ సమీక్ష సాగిందిలా..

సీబీఐ విచారణ..టీడీపీ నేతలే లక్ష్యంగా..

సీబీఐ విచారణ..టీడీపీ నేతలే లక్ష్యంగా..

టీడీపీ ప్రభుత్వ హాయంలో అక్రమ మైనింగ్ వ్యవహారం కేసు హైకోర్టుకు చేరింది. కోర్టు సూచనల మేరకు సీఐడీ విచారణ చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో..గత వారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో మైనింగ్ వ్యవహారం లో టీడీపీ ముఖ్య నేత యరపతినేని శ్రీనివాస రావుతో పాటుగా టీడీపీ నేతల ప్రమేయం ఉందనేది వైసీపీ నేతల ఆరోపణ. అదే విధంగా బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని కోర్టు సూచించింది. దీని ద్వారా టీడీపీ నేతలు చిక్కుకుంటారని..దీనికి మద్దతుగా నిలిచిన నాటి ప్రభుత్వంలోని ముఖ్యులు సైతం ఇబ్బందులు పడక తప్పదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. గతంలోనే పల్నాడు అక్రమ మైనింగ్ పైన సీబీఐ విచారణ చేయించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసారు. ఇక, ఇప్పటికే అనేక మంది సాక్ష్యులను విచారించటంతో ఈ వ్యవహారం ఖచ్చితంగా టీడీపీ ముఖ్యులకు చుట్టుకొనే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అంచనా వేస్తోంది. దీనికి కప్పి పుచ్చటానికే టీడీపీ దాడుల వ్యవహారం పేరుతో రాజకీయంగా చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

అగ్రి గోల్డ్ వ్యవహారంటో ఈడీ ఎంట్రీ..

అగ్రి గోల్డ్ వ్యవహారంటో ఈడీ ఎంట్రీ..

అగ్రిగోల్డ్ కేసు లో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. అగ్రీగోల్డ్ కేసు లో రంగం లోకి దిగిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ. కేసు విచారణలోని ఫోర్నెక్స్ నివేదిక సీఐడీ ఇవ్వలేదని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఫోరెన్సీక్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలని సీఐడీని కోరితే ఇవ్వడంలేదని ఈడీ పిటిషన్ లో పేర్కొంది. 8 రాష్ట్రాల్లో 32లక్షల మంది మోసం చేసిందంటూ..అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసారు. అగ్రిగోల్డ్ నిధులను అక్రమంగా విదేశాలకు తరలించిందని సీబీఐ, ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. దీంతో..బాధితులు ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి అగ్రిగోల్డ్ వ్యవహారంలో టీడీపీ ముఖ్య నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తోంది. నాటి మంత్రులు సైతం భాగస్వాములు అని విమర్శించింది .హాయ్ లాండ్ విషయంలో మంత్రి లోకేష్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసారు వైసీపీ నేతలు. ఇక, ఇప్పుడు ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకుంటే నాడు అధికారంలో ఉండి తప్పించుకున్న టీడీపీ ముఖ్యులు ఖచ్చితంగా చిక్కుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ముఖ్యమైన టీడీపీ నేతల జోక్యం బయట పడుతుందని చెబుతున్నారు. ఇలా..అక్కడ సీబీఐ..ఇక్కడ ఈడీ ద్వారా మొత్తంగా టీడీపీ నేతలు ఇరుకున పడుతారని..తాము చేసిన విమర్శలు నిజమని తేలుతాయని అంచనాతో వైసీపీ నేతలు ఉన్నారు.

ఏపీ హైకోర్టు బదిలీ కోరుతూ పిటీషన్..

ఏపీ హైకోర్టు బదిలీ కోరుతూ పిటీషన్..

మరోవైపు అగ్రిగోల్డ్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి విరుద్దంగా కేసును బదిలీ చేయెద్దని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు విడుదల చేసింది. వాటిని సంస్థ ఆస్తుల ఆక్షన్ ద్వారా తిరిగి రాబడతామని ప్రభుత్వం చెబుతోంది. ఈడీ విచారణ ప్రారంభం అయితే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు పిటిషన్లపై ఈనెల 26న తెలంగాణ హైకోర్టు విచారించనుంది.

English summary
Ap Govt oredered for CBI investigation on Palandu illegal Mining. ED implead in Agrigold case in Telangana High court. In both cases YCP leaders cornered TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X