అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11న ఢిల్లీలో సీయం దీక్ష : 10న ఏపిలో ప్ర‌ధాని స‌భ : చ‌ంద్ర‌బాబు వ‌ర్సెస్ మోదీ..!

|
Google Oneindia TeluguNews

చంద్ర‌బాబు వ‌ర్సెస్ మోదీ. బిజెపి వ‌ర్సెస్ టిడిపి. ప్ర‌ధాని మోదీని ల‌క్ష్యంగా చేసుకొని అటు జాతీయ రాజ‌కీయాల్లోనూ.. ఇటు ఏపిలోనూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఇదే స‌మ‌యంలో బిజెపి అధినాయ‌క‌త్వం సైతం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా రివ‌ర్స్ ఎటాక్ మొద‌లు పెట్టింది. అందులో భాగంగా.. ఫిబ్ర‌వ‌రి 11న ఢిల్లీలో దీక్ష చేయాల‌ని చంద్రాబు నిర్ణ‌యించారు. దీనికి కౌంట‌ర్ గా ఫిబ్ర‌వ‌రి 10న మోదీ ఏపికి వ‌స్తున్నారు.

ఈయ‌న అటు..ఆయ‌న ఇటు..

ఈయ‌న అటు..ఆయ‌న ఇటు..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల సాధ‌న కోసం అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసారు. ప్ర‌ధాన పార్టీలు గైర్హాజ‌రైనా ప్ర‌జా-ఉద్యోగ సంఘాల నేత‌లు హాజ‌ర‌య్యారు. అందులో ఫిబ్ర‌వ‌రి 1 నుండి 13వ తేదీ వ‌ర‌కు కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే ఫిబ్ర‌వ‌రి 11ప ముఖ్య‌మంత్రి అధికార పార్టీ నేత‌లు ఢిల్లీలో దీక్ష చేయాల‌ని డిసైడ్ అయ్యారు. త‌రువాతి రోజు ఫిబ్ర‌వ‌రి 12న రాష్ట్రప‌తిని క‌లిసి ఏపికి జ‌రిగిన అన్యాయం వివ‌రించాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట న ఖ‌రారైంది. ముఖ్య‌మంత్రి ఢిల్లీలో దీక్షకు ఒక‌రోజు ముందు ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌ధాని మోదీ ఏపికి వ‌స్తున్నారు. గుంటూ రు లో బ‌హిరంగ స‌భ లో పాల్గొంటారు. ముఖ్య‌మంత్రి దీక్ష నిర్ణ‌యం..ప్ర‌ధాని ఏపి ప‌ర్య‌టన తో ఇప్పుడు కొత్త పోరాటం మొద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అక్క‌డ ల‌క్ష్యం మోదీ..ఇక్క‌డ టార్గెట్ బాబు..

అక్క‌డ ల‌క్ష్యం మోదీ..ఇక్క‌డ టార్గెట్ బాబు..

ఇక‌, ముఖ్య‌మంత్రి ఢిల్లీ వేదిక‌గా చేసే దీక్ష‌కు జాతీయ స్థాయిలో ఇప్ప‌టికే టార్గెట్ మోదీ ల‌క్ష్యంగా కొన‌సాగిస్తున్న మైత్రి లో భాగంగా ఉన్న 21 పార్టీల నేత‌లు సంఘీభావం తెల‌ప‌నున్నారు. చంద్ర‌బాబు దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రాహుల్ గాంధీ తో పాటుగా భాగ‌స్వామ్య పార్టీల నేత‌లు త‌ర‌లి వ‌స్తార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ఆ దీక్షా వేదిక ద్వారా జాతీయ స్థా యి లో ఏపి అంశాల‌ను హైలైట్ చేయ‌టంతో పాటుగా.. రాజ‌కీయంగానూ మైలేజ్ సాధించే వ్యూహాల‌ను టిడిపి అమ‌లు చేస్తోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ గ‌తంలోనే గుంటూరు స‌భ‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, అది వాయి దా ప‌డి ఫిబ్ర‌వ‌రి 10న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ‌కు వ‌చ్చే మోదీ స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల క్ష్యంగా మాట్లాడుతార‌ని..ఏపికి కేంద్రం అందించిన సాయంతో పాటుగా హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ రించిందీ ప్ర‌ధాని వివ‌రిస్తార‌ని బిజెపి నేత‌లు చెబుతున్నారు. ప్ర‌ధాని వాస్త‌వాలు చెప్ప‌టం ద్వారా చంద్ర‌బాబు ఇరుకు న ప‌డ‌తార‌నేది బిజెపి నేత‌ల అంచ‌నా.

ఏపిలో మోదీ టీం..టిడిపి ప్ర‌చారం తిప్పికొట్టేలా..

ఏపిలో మోదీ టీం..టిడిపి ప్ర‌చారం తిప్పికొట్టేలా..

ఏపిలో బిజెపి పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని..తాము ఈ అయిదేళ్ల కాలంలో ఏపికి ఏం చేసామో అంకెల‌తో స‌హా వివ‌రించాల‌ని ప్ర‌ధాని మోదీ పార్టీ నేత‌ల‌ను ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగా..ప్ర‌ధాని మోదీ ఫిబ్ర‌వ రి లో రెండు సార్లు ఏపికి వ‌స్తున్నారు. 10న గుంటూరు..ఆ త‌రువాత విశాఖ‌ల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. బిజెపి జాతీయాధ్య క్షుడు అమిత్ షా మూడు విడత‌లుగా ఏపిలో ప‌ర్య‌టన షెడ్యూల్ ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 4న తొలి విడ‌త‌లో భాగంగా షా ఏపి కి వ‌స్తున్నారు. ఇక‌, విడ‌త‌ల వారీగా కేంద్ర మంత్రులు ఏపిలో ప‌ర్య‌టించ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుండి ఇప్ప టి దాకా ఏ విభాగాల్లో ఎంత మేర సాయం అందించిందీ వివ‌రించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ను రాజ‌కీయం గా లక్ష్యంగా చేసుకొని బిజెపి నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు..స‌భ‌లు..ప్ర‌సంగాలు సాగ‌నున్నాయి.

English summary
PM Modi visiting AP on February 10th. He participate in Guntur open meeting. On February 11th Cm Chandra Babu decided to conduct deekhsa at Delhi. Before that day Modi coming for AP Visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X