• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాధాకృష్ణా! ఈ భజన ఎందుకండీ?: నాగబాబు, పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూ లాగి...

|

హైదరాబాద్: ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో సెటైర్లు వేశారు. లోకేష్‌కు భజన చేస్తున్నారని చెప్పారు. అయితే దీనిని తొలగించాలని సదరు ఛానల్ ఆయనను ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగబాబు మరోసారి తాజాగా, గురువారం స్పందించారు.

ఓ ఛానల్లో వచ్చిన వీడియోపై తన కామెంట్ పెట్టానని, నేను వారి గురించి తప్పుగా మాట్లాడలేదని, అయినప్పటికీ తన ఛానల్ నుంచి వారి న్యూస్ ఐటంను తీసివేయాలని ఈ మెయిల్ పెట్టారని, ఆ ఐటం తీసివేయకుంటే తన ఛానల్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారని నాగబాబు చెప్పారు. ఈ విషయంలో తాను అసంతృప్తితో ఉన్నానని, ఏదో సరదాగా చేసినందుకు మీరు అంత సీరియస్ అవుతే ఎలా సార్.. కోప్పడకండి సార్.. అని నవ్వుతూ చెప్పారు. పత్రికా స్వేచ్ఛను నొక్కకూడదని చెప్పి, మా స్వేచ్ఛను నొక్కివేస్తారా అని చెప్పారు. మీ పైన ఓ చిన్న జోక్ వేస్తే తట్టుకోలేరా అన్నారు. మీరు చెప్పినట్లే ఆ వీడియోను తీసేస్తానని చెప్పారు.

శ్రీరెడ్డి ఇష్యూని గుర్తు చేసి

శ్రీరెడ్డి ఇష్యూని గుర్తు చేసి

ఎవరో ఒక ఆడపిల్ల బూతు తిడితే, అది బూతు కాదని, వ్యవహార భాషలో వాడే పదమని మీరు మా పైన (మెగా కుటుంబం, పవన్ కళ్యాణ్) వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్లు మాట్లాడారని శ్రీరెడ్డి ఇష్యూను గుర్తు చేశారు. మేం మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ చేయవద్దా అన్నారు. మీ బట్రాజు పొగడ్తలను మేం ప్రశ్నించవద్దా అన్నారు. మీరు మీ వార్త చూపిన నా వీడియోను ఆపగలరేమో కానీ, నా ఎక్స్‌ప్రెషన్‌ను ఎలా ఆపుతారని ప్రశ్నించారు.

ఏబీఎన్ భజన కృష్ణ

ఏబీఎన్ భజన కృష్ణ

ఈ సందర్భంగా సీబీఎన్ - భజన కృష్ణ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పారు. మీ ముందు ఇంకా ముందు చాలా ఉన్నాయని చెప్పారు. మీరు ఒక్క వీడియో ఆపినంత మాత్రాన నా ఛానల్, నా జర్నీ ఆగిపోదని చెప్పారు. మీరు మీ టీవీ ఛానల్‌తో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కదా అని గుర్తు చేశారు. అఫ్ట్రాల్ ఒక్క వీడియో తీసేసినంత మాత్రాన మేం బాధపడమని చెప్పారు. నా భావాలను ఆపలేరని చెప్పారు. ఈ సందర్భంగా మళ్లీ లోకేష్ స్పీచ్‌పై భజన చేశారంటూ విమర్శలు గుప్పించారు.

రాధాకృష్ణా! ఇలాంటి భజన ఎందుకండి?

రాధాకృష్ణా! ఇలాంటి భజన ఎందుకండి?

నారా లోకేష్, చంద్రబాబును చూసి కియా పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని భజన కొట్టారంటూ చిరుతలు కొడుతూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ఏపీలో పెట్టుబడులు పెడతానంటే కబ్జా చేయాలని చూశారని ఏబీఎన్ చెప్పిందని, ఆయనకు మరేం పని లేదని అలా చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఆంధ్రా చాలా డెవలప్ అయిందని మోడీ దీనిపై దృష్టి సారించారా అని విమర్శల వర్షం కురిపించారు. ఇలాంటి భజనలు ఎందుకండీ అని ప్రశ్నించారు.

ఇక నుంచి దావోస్ వంటి వాటికి వంటవాళ్లు

ఇక నుంచి దావోస్ వంటి వాటికి చంద్రబాబు, లోకేష్ వెళ్లవలసిన అవసరం లేదని, 'చంద్రజ్యోతి' ప్రకారం ఏపీ నుంచి బాగా వంట వచ్చిన నలుగురైదుగురిని అలాంటి చోట్లకు పంపిస్తే చాలునని ఎద్దేవా చేసారు. అప్పుడు వారు భోజనాలు చేసి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఇక నుంచి ఆ పని చేద్దామన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మీకే కాదని మాకూ ఉందని చెప్పారు.

English summary
Naga Babu has once again hit out at ABN Andhra Jyothi's Radhakrishna, terming him CBN Bhajana Krishna (where CBN stands for Chandrababu Naidu). He also dubbed the channel as CBN Chandra Jyothi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more