అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి.. ఏపీ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కండి: చివర్లో నాగబాబు ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: మెగా సోదరుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగబాబు తనదైన శైలిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ స్కిట్‌తో వచ్చిన నాగబాబు, తాజాగా 'సైకిల్‌ను తొక్కితే ఆరోగ్యానికి మంచిది' అనే కాన్సెప్ట్‌తో వచ్చారు. ఇక్కడ సైకిల్‌ను తొక్కడం అంటే రాజకీయంగా ఆయన ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా ఈ పోస్ట్ పెట్టి ఉంటారని చెబుతున్నారు.

సైకిల్‌ను కిందపడేసి

సైకిల్‌ను కిందపడేసి

విషయానికి వస్తే, తాజా వీడియోలో ఓ చిన్న బాలుడు తన సైకిల్‌ను కిందపడేసి అదేపనిగా తొక్కేస్తుంటాడు. సైకిల్ ముందు చక్రాన్ని, వెనుక చక్రాన్ని, సైకిల్ ఇతర భాగాలను తన కాలితో తంతాడు. అదే సమయంలో మరో బాలుడు ఓ సైకిల్‌ను తొక్కుతాడు. అంటే మొదటి బాలుడు సైకిల్‌ని కాలితో తంతుంటే, రెండో బాలుడు సైకిల్ పైన రౌండ్లు వేస్తాడు.

'వైయస్ జగన్ చెప్పాడా... అయితే ఒకే.. ఇదీ చంద్రబాబు నాయుడు మాట''వైయస్ జగన్ చెప్పాడా... అయితే ఒకే.. ఇదీ చంద్రబాబు నాయుడు మాట'

సైకిల్‌ను తొక్కితే ఏపీకి మంచిదని

సైకిల్‌ను తొక్కితే ఏపీకి మంచిదని

అప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో నాగబాబు.. బాబూ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. దానికి ఆ బాలుడు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది అని సైకిల్ తొక్కుతున్నాను అంకుల్ అని చెబుతాడు. అలా చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సైకిల్‌ని తన్నుతున్న బాలుడ్ని ఉద్దేశించి... ఏయ్ బాబూ.. ఏం నువ్వేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి ఆ బాలుడు.. సైకిల్‌ని తొక్కితే ఆంధ్రప్రదేశ్‌కు మంచిదని సైకిల్‌నే తొక్కుతున్నాను అంకుల్ అని చెబుతాడు.

చివరలో చిన్న ట్విస్ట్

చివరలో నాగబాబు కనిపించి.. ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి, మరిచిపోరుగా.. అని చెబుతారు. ఆ తర్వాత మాట్లాడుతూ... ఇందులో వాహనం ఏ వ్యక్తికి సంబంధించినది కాదని, ఒక సైకిల్ కంపెనీకి మేం ఇచ్చిన యాడ్ అని సెటైరిక్‌గా చెబుతారు.

English summary
Mega brother Nagababu cycle ad on andhra pradesh politics over Andhra Pradesh Assembly Elections and Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X