అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌వ‌న్ కు అండ‌గా నాగబాబు :జ‌న‌సేన లో ఎంట్రీ : న‌ర్సాపురం ఎంపీగా బ‌రిలోకి..!

|
Google Oneindia TeluguNews

త‌మ్ముడు కు అండ‌గా అన్న‌య్య రంగంలోకి దిగారు. జ‌న‌సేన లో ప‌వ‌న్ క‌ళ్యాన్ సోద‌రుడు నాగ‌బాబు చేరారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం లోక్‌స‌భ కు జ‌న‌సేన నుండి పోటీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ తాను పోటీ చేయాల‌నుకు న్న రెండు స్థానాల్లో భీమ‌వ‌రం ఒక‌టి. ఈ భీమ‌వ‌రం స్థానం సైతం న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలో ఉంది. ఇక‌, నాగబాబు ఎంపీ గా నామినేష‌న్ త‌రువాత ఇద్ద‌రూ ప్ర‌చారం వేగ‌వంతం చేయ‌నున్నారు.

నిజామాబాద్ ఆస్పత్రిలో అనుమతి లేని కొలువుల దందా ..ఏకంగా 24 మంది నకిలీలు నిజామాబాద్ ఆస్పత్రిలో అనుమతి లేని కొలువుల దందా ..ఏకంగా 24 మంది నకిలీలు

జ‌న‌సేన‌లోకి నాగబాబు..

జ‌న‌సేన‌లోకి నాగబాబు..

కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విధంగా సినీ ప్ర‌ముఖుడు నాగ‌బాబు జ‌న‌సేన లో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం వ‌రకు ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌టం పై ఆస‌క్తి చూప‌లేదు. అయితే, సోద‌రుడు ప‌వ‌న్ కోరిక మేర‌కు నాగబాబు జ‌న‌సేన లో చేర‌టానికి నిర్ణ‌యించారు. గ‌త వారం నాగబాబు గుంటూరు లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఇప్ప‌టికే చంద్ర‌బాబు..జ‌గ‌న్ పై పొలిటిక‌ల్ సెటైర్లు తో ప‌రోక్షంగా జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేస్తూ నే ఉన్నారు. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ క‌ళ్యాన్ కు మెగా కుటుంబం నుండి మ‌ద్ద‌తు ఉన్నా..అది పార్టీలో చేరి మ‌ద్ద తు ఇచ్చే ప‌రిస్థితుల్లో లేదు. కానీ, ఇప్పుడు నేరుగా నాగబాబు జ‌న‌సేన లో చేర‌టం..ఎంపీగా బ‌రిలో దిగుతుండ‌టంతో ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన త‌రువాత ఇప్పుడు నాగబాబు చేర‌టం తో కొంత ఆల‌స్యం క‌నిపిస్తున్నా..ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మెగా సోద‌రులు పోటీ చేస్తుండ‌టంతో అక్క‌డ ఖ‌చ్చితంగా జ‌న‌సేన ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన గుబ్బాల త‌మ్మ‌య్య 2,67,0058 ఓట్లు సాధించారు.

అన్న లోక్‌స‌భ‌కు..త‌మ్ముడు అసెంబ్లీకి..

అన్న లోక్‌స‌భ‌కు..త‌మ్ముడు అసెంబ్లీకి..

ఇప్పుడు జ‌న‌సేన లో చేరుతున్న స‌మ‌యంలోనే నాగబాబు ఎక్క‌డి నుండి పోటీ చేసేదీ క్లారిటీ ఇచ్చేసారు. ఇప్ప‌టికే పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో ఒక‌టైన భీమ‌వ‌రం అ సెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలో ఉంది. న‌ర్సాపురం లోక్‌స‌భ స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక ల్లో ప‌దిహేను సార్లు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు గెల‌వ‌గా..కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు రెండు సార్లు గెలుపొందారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టిడిపి నుండి కె శివ‌రామ రాజు పోటీ చేస్తుండ‌గా..వైసిపి నుండి ర‌ఘురామ కృష్ణం రాజు బ‌రిలో ఉన్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన నుండి వ్యూహాత్మ‌కంగా నాగ‌బాబు ను ఈ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి బ రిలోకి దించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు. ఇప్పుడు నాగ‌బాబు ఎంట్రీతో ఈ లోక్‌స‌భ నియోజక వ‌ర్గం లో ఎన్నిక ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

నా నాయ‌కుడు కోసం ఏదైనా..

నా నాయ‌కుడు కోసం ఏదైనా..

త‌మ్ముడు కాదు..పార్టీ అధినేత ప‌వ‌న్‌..ఆత‌డి కోసం ఎంపీగా కాదు..ఆఫీసు లో ప‌ని చేయ‌మ‌న్నా సిద్ద‌మ‌ని నాగ‌బాబు ప్ర‌క‌టించారు. చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో నాగబాబు..ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇద్ద‌రూ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిం చారు. ఆ పార్టీ లో ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో మాత్రం పోటీ చేయ‌లేదు. ఇప్పుడు ఇద్ద‌రూ బ‌రిలో ఉంటుండటంతో జ‌న‌సేన అభిమానుల్లో కొత్త జోష్ క‌నిపిస్తోంది.

English summary
Cine actor Nagababau joined in Janasena in presence of his brother and party chief Pawan Kalyan. Naga Babu decided to contest from Narsapuram Loksabha constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X