India
  • search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ ఓ జోకర్.. పులివేషాలు వేస్తే సింహాలు కారు: పిన్నెల్లి ఫైర్

|
Google Oneindia TeluguNews

టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై వైఎస్ఆర్ సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. మాలోకానికి శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలిదని ఫైరయ్యారు. పల్నాడులో పరామర్శ పేరుతో వచ్చి, నాలుగు దండలు వేసుకుని, నుదుట పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. పల్నాడులో ఏం జరుగుతుందో, అసలు పల్నాడు చరిత్ర ఏమిటో నారా లోకేష్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. నిన్న లోకేష్ మొహం చూస్తుంటే.. నిరాశ, నిస్పృహలు కొట్టొచ్చినట్లు కనిపించాయని.. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడుకు వచ్చిన లోకేష్‌ మీసాలు మెలేసి, తొడలుకొట్టి, డైలాగులు చెబుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ సినిమాల్లో కమెడీయన్ గుర్తొచ్చారని పేర్కొన్నారు

 వీరుడు కాదు.. బాబు

వీరుడు కాదు.. బాబు


లోకేష్ వీరుడు కాదు ఒక జోకర్. హతుడు జల్లయ్య గురించి నారా లోకేష్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జల్లయ్యపై పది కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాంటి వ్యక్తి, వారి వ్యక్తిగత గొడవల్లో హత్యకు గురైతే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావని గుర్తుచేశారు. పల్నాడు రాజకీయాలు తెలియకపోతే.. మీ తండ్రిని అడిగితే చెబుతారని సూచించారు. రాజకీయాలంటే, ఆఫ్‌ నిక్కర్లు వేసుకుని విదేశాల్లో స్విమ్మింగ్‌ఫూల్‌లో అమ్మాయిలతో తిరగడం అనుకున్నావా అని మండిపడ్డారు. నీ పక్కన కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి తల్లి 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్‌ మర్డర్స్‌ జరిగాయి. అలాంటి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డిని.. పక్కన కూర్చోబెట్టుకుని ఫ్యాక్షన్ గురించి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.

 ఏ1 ముద్దాయి..

ఏ1 ముద్దాయి..


ఏడుగురుని హతమార్చిన కేసులో బ్రహ్మారెడ్డి ఏ1 ముద్దాయి. సొంత బాబాయ్‌ని చంపిన కేసులో ఏ1గా ఉన్నాడని గుర్తుచేశారు. సొంత కొడుకును చంపిన కేసులో ఏ1 ముద్దాయి బ్రహ్మారెడ్డి అని చెప్పారు. పల్నాడులో ఫ్యాక్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పల్నాడులో తిరిగి ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టాలని మీరు చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో 2004 నుంచి మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎక్కడా కూడా ఫ్యాక్షన్‌కు సంబంధించిన గొడవలు జరగనివ్వకుండా అణచివేశామని వివరించారు.

 ఏం చేయాలని అనుకుంటున్నారు..?

ఏం చేయాలని అనుకుంటున్నారు..?


ఫ్యాక్షన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న బ్రహ్మారెడ్డిని, మాచర్లకు పంపించి తండ్రీకొడుకులు మళ్ళీ ఇక్కడ నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే 2019లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి ఈసారి ఎన్నికల్లో మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మీ నీచ రాజకీయాలను చూసి పల్నాడు ప్రజలు మిమ్మల్ని ఛీకొడుతున్నారు. మీకు అసలు బయోడేటా అనేది ఉందా అని సూటిగా ప్రశ్నించారు. అసలు లోకేష్‌ బుర్రలో డేటా అనేది ఏమైనా ఉందా? లోకేష్‌కు అమరావతిలో ఆధార్‌ కార్డే లేదు. నువ్వు, నీ తండ్రి హైదరాబాద్‌ నుంచి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే టూర్టిస్ట్‌లు అని విరుచుకుపడ్డారు.

విడ్డూరంగా ఉందే

విడ్డూరంగా ఉందే


మంగళగిరిలో ఓడిపోయి, దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ సవాళ్ళు విసురుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. పల్నాడులో నీళ్లు లోకేష్ ఎప్పుడూ రుచి చూసినట్టు లేదు. ఒక జోకర్లా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. గతంలో మీ చెంచాలను, మీ పార్టీ నాయకులను పల్నాడుకు పంపించి గూండాగిరి చేయాలని చూశారు. అప్పుడు మీరు రుచి చూసిన పల్నాడు ప్రజల పౌరుషం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదని లోకేష్‌కు హితవు పలుకుతున్నాం. ఫ్యాక్షన్‌ రాజకీయాలను మళ్లీ ప్రోత్సహించి పల్నాడును అల్లకల్లోలం చేయాలని చూస్తే.. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింహం లాంటి జగన్‌‌ని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో అదే పరిస్థితి లోకేష్‌‌కు ఎదురవుతుందన్నారు. పల్నాడులో ఏదో జరిగిపోతుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.

English summary
tdp leader nara lokesh is a joker ycp leader pinnelli ramakrishna reddy alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X