tdp leader nara lokesh ap cm ys jagan mohan reddy anusha murder gun jagan నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్ అనూష హత్య
గన్ లే.. జగన్ రాలే... అనూష ఇన్సిడెంట్ ప్రస్తావన.. సర్కార్‌పై నారా లోకేశ్ ఫైర్
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని చెప్పారు. మృగాళ్లు రెచ్చిపోతున్న ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూషను ప్రేమ పేరుతో విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హతమార్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు వరస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపట్టారు.
నరసరావుపేట ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... నారా లేకేశ్ స్పందించారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా అని ఫైరయ్యారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని మండిపడ్డారు. కానీ అంత సీన్ లేదని చెప్పారు. దిశ చట్టం అంటూ మాయ చేశారని ఫైరయ్యారు.

ఇప్పుడు ఏం జరిగినా గన్ను రావడం లేదని.. జగన్ కనపడటం లేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక మహిళకు కూడా న్యాయం జరిగింది లేదని చెప్పారు. కళ్ల ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ లో చలనం రావడం లేదని దుయ్యబట్టారు. నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి నుంచి బయటికు రావాలని సూచించారు. మహిళల రక్షణ తగిన చర్యలు తీసుకోవాలని సజెస్ట్ చేశారు.
అనూషని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికసాయం అందజేసి భరోసా కల్పించాలని కోరారు. నిందితులకు వెంటనే శిక్ష పడితే కుటుంబం ఆనందపడుతుందని చెప్పారు.