అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

18 నెలల్లో 468 మంది రైతుల బలవన్మరణం.. జగన్‌ సర్కార్‌పై లోకేశ్ చిందులు

|
Google Oneindia TeluguNews

ఏపీ సర్కార్‌పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పాలించే అర్హత కోల్పోయారని ఫైరయ్యారు. ఏడాదిన్నరలో ఏ వర్గాలు కూడా సంతృప్తిగా లేరు అని చెప్పారు. అందరూ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పారు. జగన్ పార్టీలో ఉన్న రైతు.. రియాలిటీలో కనిపించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను మరచిన ఘనత వారికే దక్కుతుందని చెప్పారు. అన్నదాతల వెతలను పట్టించుకోలేని జగన్.. పాలించే అర్హత కోల్పోయారని చెప్పారు.

రైతులు ప్రాణాలు కోల్పోలవడం బాధాకరం అని నారా లోకేశ్ అన్నారు. వారి మృతికి కారణమైన జగన్‌కు పాలించే అర్హత లేదన్నారు. సమస్యపై మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు చెప్పకుండా.. కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. అన్నదాతల ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడటం దారుణమన్నారు.

nara lokesh slams cm ys jagan

వైఎస్ జగన్ 18 నెలల పాలనలో 468 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నారా లోకేశ్ తెలిపారు. రైతులకు ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం జగన్ విధానాలే కారణం అని చెప్పారు. మంత్రులు ప్రతిపక్షాలను ప్రశ్నించడం మాని.. జగన్‌ను నిలదీస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాడుతుందని నొక్కి వక్కానించారు.

English summary
tdp leader, mlc nara lokesh slams cm ys jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X