• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నారా లోకేశ్ లేఖాస్త్రం: టెన్త్ పేపర్ లీకేజీపై.. మంత్రి బొత్స తీరుపై పైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకే్శ్ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారి నిర్వ‌హిస్తోన్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణా వైఫ‌ల్యంతో అభాసుపాల‌య్యాయని లోకేశ్ లేఖ స్టార్ట్ చేశారు. జగన్ సీఎం అయి మూడేళ్ల‌ు అయ్యింది. కానీ క‌రోనా వల్ల రెండేళ్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గలేని సంగతి తెలిసిందే. రోజుకో చోట పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, ఒక‌రి బ‌దులు ఒక‌రు ప‌రీక్ష‌లు రాయించ‌డం, లీకైన ప్ర‌శ్న‌ప‌త్రాల‌కి జ‌వాబులు రాయించి జ‌త‌ చేయ‌డం వంటివ‌న్నీ జ‌రిగాయి.

CM Jagan కి పదో తరగతి పరీక్షల నేపథ్యం లో లెటర్ రాసిన Nara Lokesh | Telugu Oneindia

ప్ర‌తిభ‌కి కొల‌మానంగా నిల‌వాల్సిన ప‌రీక్ష‌లు అక్ర‌మాల విక్ర‌మార్కులకి వ‌రం అయ్యాయని కామెంట్ చేశారు. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్స‌ప్ గ్రూపుల్లో ప్ర‌శ్నాప‌త్రాలు ప్ర‌త్య‌క్షం అవడం వైసీపీ నాయ‌కుల పిల్ల‌ల‌కి మెరుగైన మార్కుల కోసం బ‌రితెగించార‌ని స్ప‌ష్టం చేస్తోందని లోకేశ్ గుర్తుచేశారు. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం ప్ర‌భుత్వంపై నిర‌స‌న గ‌ళం వినిపించిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష పెట్టుకుని మ‌రీ వేధించేందుకు టెన్త్ ప‌రీక్ష‌ల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలు ఉన్నాయి.
టీచ‌ర్ల‌కి టెన్త్ ఫ‌లితాలు టార్గెట్లు పెట్టి, మ‌రోవైపు పేప‌ర్‌ లీక్‌ల‌కి బాధ్యుల్ని చేస్తూ స‌స్పెండ్ చేయ‌డం స్ప‌ష్టం చేస్తోంద‌ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

nara lokesh writes letter to cm ys jagan

పదో తరగతి పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై ప్ర‌భుత్వం స్పంద‌న చాలా హాస్యాస్ప‌దంగా ఉందన్నారు. టిడిపి హ‌యాంలో పేప‌ర్ లీక్ అయిన ఘ‌ట‌న‌లో అప్ప‌టి మంత్రి జీఎంసీ బాల‌యోగి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన చ‌రిత్ర‌ని గుర్తు చేశారు. సీఎంగా మీ వైఫ‌ల్యం, అధికారుల చేత‌గానిత‌నం, వైసీపీ నేత‌ల స్వార్థంతో టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అభాసుపాలై 6.22 లక్షల మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు అయోమయంగా మారిందని లోకేశ్ అన్నారు. ఇంకా రెండు రోజులు ప‌రీక్ష‌లున్నా..ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌తీ ప‌రీక్ష పేప‌ర్ లీకై ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌నే అప‌హాస్యం అయ్యిందని మండిపడ్డారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మేథ్స్ క్వ‌శ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్‌కి చేరకుండా ముందుగా వైసీపీకి చెందిన వాట్స‌ాప్ గ్రూపుల్లో కనిపిస్తున్నాయి.

ఏలూరు జిల్లా మండవల్లి హైస్కూల్‌లో పేపర్ లీక్ చేయడమే కాకుండా..స‌మాధాన‌ప‌త్రాలు రాసి అందించ‌డం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో డొల్ల‌త‌నాన్ని వెల్ల‌డిస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు, నంద్యాల, నందికొట్కూరుల్లో పేప‌ర్ లీక్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో ప‌రీక్ష కేంద్రాన్నే మార్చేయ‌గా, గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలో ఓ టీచర్ మాల్ ప్రాక్టీసుకి పాల్ప‌డ‌టం ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఎంత అధ్వానంగా ఉందో స్ప‌ష్టం చేస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ విప‌రీతంగా జ‌ర‌గ‌డం క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థుల పాలిట శాపంగా మార‌నుంది.

పేప‌ర్ల లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రీక్ష‌లు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని ఇచ్చిన స‌మాధానం కూడా బాధ్య‌తారాహిత్య‌మే. మంత్రి బొత్స‌ని విద్యాశాఖ నుంచి త‌ప్పించాలి. ఇంకా మిగిలిన రెండు పరీక్ష‌ల్ని అయినా ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి. ఇంత జరుగుతున్నా మీరు కనీసం పేపర్ లీక్ ఘటనలపై సమీక్ష నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎదురైన ఘోర‌వైఫ‌ల్యం నుంచి గుణ‌పాఠం నేర్చుకుని ఇంట‌ర్ ప‌రీక్ష‌లు క‌ట్టుదిట్టంగా జ‌రిపేందుకు ఏర్పాట్లు చేయాల‌ని లోకేశ్ కోరారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో వైఫ‌ల్యం చెంది, విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడుకుంటోన్న‌ ఉన్న‌తాధికారుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు.

English summary
tdp leader nara lokesh writes letter to cm ys jagan mohan reddy on tenth paper leakage issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X