• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త‌ర‌లి వ‌చ్చిన జాతీయ నేత‌లు : మోదీ హటావ్ .. దేశ్ బచావ్ : చ‌ంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా..

|

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా జాతీయ నేత‌లు దీక్షా స్థ‌లి వ‌ద్ద‌కు త‌ర‌లి వచ్చారు. ఏపికి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌ధాని మోదీ పై నేత‌లంతా ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌, కాంగ్రెస్ నేత‌లు ఆనంద శ‌ర్మ‌, అహ్మ‌ద్ ప‌టేల్‌, స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ములాయం, తృణ‌మూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఎల్జేడీ నేత శరద్ యాదవ్ మ‌ద్ద‌తు ప‌లికిన వారిలో ఉన్నారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా ఫోన్‌లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఆయ‌నే ముఖ్య‌మంత్రిగా ఉండాలి..

ఆయ‌నే ముఖ్య‌మంత్రిగా ఉండాలి..

చంద్రబాబు నాయుడు లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ము లాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబు పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. సమాజ్ వాదీ మొ త్తం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా.. మీతో పాటు ఉంటాం. మీరిచ్చిన గౌరవన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చంద్రబాబు బలహీన పడితే.. దేశ రాజకీయాలకు అంతమంచిది కాదు. అన్నీ పనులు వదిలి.. ఇక్కడికి వచ్చాను. ఆరోగ్యం బాగోలేదని డాక్టర్లు వారించినా.. చంద్రబాబు కోసం వచ్చాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఆయన బతికి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి.. ఆయన చేపట్టిన కార్య క్రమాలు సఫలం కావాలి అంటూ చంద్రబాబుకు తన పూర్తి సంఘీభావాన్ని ములాయం ప్ర‌క‌టించారు.

మోదీ హటావ్ .. దేశ్ బచావ్

మోదీ హటావ్ .. దేశ్ బచావ్

మోదీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందంటూ టీఎంసీ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా భవన్‌లో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. మోదీ, అమిత్ షాల చరిత్ర అందరికీ తెలుసునని.. మోదీ హటావ్ .. దేశ్ బచావ్ అన్నదే తమ లక్ష్యమన్నారు.కోల్‌కతాలో 22 పార్టీల నేతలు.. ఒక్కటయ్యారు. సీబీఐ.. ఈడీలతో మేము భయపడం. మోదీ, అమిత్ షా ద్వయం అవినీతికి తండ్రిలాంటివాళ్లు. ఇది పార్టీల సమస్య కాదు.. టీడీపీ పోరాటం కాదు.. రాజ్యాంగం కోసం జరుగుతున్న పోరాటం.. దేశాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం. అందరూ ఏకం కావాలి అంటూ పిలుపునిచ్చారు.

చం ద్రబాబు దీక్ష

చం ద్రబాబు చేస్తున్న దీక్షకు శరద్ యాదవ్ మద్దతు తెలిపారు. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని శ‌ర‌ద్ యాద‌వ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలానే అన్ని పక్షాలు ఏకమయ్యాయని గుర్తుచేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని శరద్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక‌, కాంగ్రెస్ నేత‌లు అహ్మ‌ద్ ప‌టేల్, ఆనంద శ‌ర్మ‌, జై రాం ర‌మేష్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ త‌దిత‌రులు ముఖ్య మంత్రి చంద్ర‌బాబు దీక్ష‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

English summary
Many National Leaders expressed their solidarity for Chandra Babu And AP Public. Those leaders fire on Modi attitude and demand for implementation of Re organisation assurances for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X