అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ మీడియా వ‌ర్సెస్ ఆక్టోప‌స్‌: ల‌గ‌డ‌పాటి కి అగ్ని ప‌రీక్ష : ఏది నిజం..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అంచ‌నాల్లో ఊహించ‌ని ట్విస్ట్‌. జాతీయ ఛాన‌ళ్లు దాదాపుగా అన్నీ టిఆర్‌య‌స్ కు అనుకూల తీర్పు వ‌స్తుంని అంచ‌నా వేస్తే..ఆంధ్రా ఆక్టోప‌న్ ల‌గ‌డ‌పాటి మాత్రం త‌న రూటే స‌ర‌పేటు అని చెప్పారు. తెలంగాణ లో జ‌రి గిన ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి ఆధిక్య‌త సాధిస్తుంద‌ని విశ్లేషించారు. జాతీయ ఛానళ్ల స‌ర్వేల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉం డ‌టంతో టిఆర్‌య‌స్ శ్రేణులు ఆనందంలో ఉండ‌గా..ఒక్క సారి ల‌గ‌డ‌పాటి స‌ర్వే వారికి షాక్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నిక ల ఫ‌లితాల పై తెలంగాణాలోనే కాదు..ఏపిలో నూ ఆస‌క్తి క‌నిపిస్తోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఫ‌లితాల పై జాతీయ మీడి యా వ‌ర్సెస్ ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పరిస్థితి మారింది. దీంతో..11న ఫ‌లితాలు రాజ‌కీయ పార్టీల‌కే కాదు..ల‌గ‌డ‌పాటికి అగ్నిప‌రీక్ష గా మారింది. మ‌రి..జాతీయ చానళ్లు..ఆక్టోప‌స్‌గా మారిన ఫ‌లితాల్లో ఏది నిజం...

అవ‌న్నీ ఒక గ‌ట్టున‌...ల‌గ‌డ‌పాటి రూట్ స‌ప‌రేటు..

అవ‌న్నీ ఒక గ‌ట్టున‌...ల‌గ‌డ‌పాటి రూట్ స‌ప‌రేటు..

తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్ మ‌రి కాసేప‌ట్లో ముగుస్తుంద‌నగా కెటిఆర్ ఓ నోట్ విడుద‌ల చేసారు. తాము ఎన్నిక‌ల్లో మూ డింట రెండొంతుల మెజార్టీతో గెల‌వ‌బోతున్నామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక‌, పోలింగ్ ముగిసిన వెంట‌నే ట్వీట్ ద్వారా తాము తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని...దాదాపు వంద సీట్ల‌లో గెలుస్తున్నామ‌ని జోస్యం చెప్పారు. ఇదే స‌మ యంలో పిసిసి అధ్య‌క్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సైతం తమ కూటిమి 80 -85 సీట్లు గెలుస్తున్నామ‌న ధీమాగా చెప్పుకొచ్చారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి త‌న స‌హ‌జ శైలిలో ఫ‌లితాల పై విశ్లేష‌ణ చేసారు. కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక లు ముగుస్తూనే జాతీయ ఛాన‌ళ్లు త‌మ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల‌ను వ‌రుస‌గా ప్ర‌క‌టించాయి. అందులో న్యూస్ ఎక్స్ మిన‌హా అన్నీ టిఆర్‌య‌స్ కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌స్తుంద‌ని తేల్చాయి. ఆ అంచ‌నాల‌తో అంద‌రూ ఇక‌, తెలంగాణ లో టిఆర్‌య‌స్ గెలుపు ఖాయ‌మ‌నే అంచ‌నాకు వ‌చ్చేసారు. కానీ,అక్క‌డ ట్విస్ట్. ఎన్నిక‌ల ఫ‌లితాల అంచ‌నాల్లో పేరున్న ల‌గ‌డ‌పాటి త‌న స‌ర్వేతో ముందుకొచ్చారు. తెలంగాణ లో మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేసారు. అయితే, హోరా హోరీగా సాగిన పోరులో ప‌ది సీట్లు ప్ల‌స్ ఆర్ మైన‌స్‌గా పేర్కొన్నారు. ప‌రోక్షంగా హంగ్ కు ఛాన్స్ అని సంకేతాలిచ్చారు...

జాతీయ ఛాన‌ళ్ల‌న్నీత‌ప్పేనా..ల‌గ‌డ‌పాటి వాద‌న ఏంటి..

జాతీయ ఛాన‌ళ్ల‌న్నీత‌ప్పేనా..ల‌గ‌డ‌పాటి వాద‌న ఏంటి..

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై నాలుగు రోజుల క్రిత‌మే ల‌గ‌డ‌పాటి త‌న అంచ‌నాల‌ను చెప్పీ చెప్ప‌క అన్న‌ట్లుగా బ‌య‌ట పెట్టేసారు. గ‌త ఎన్నిక‌ల కంటే పోలింగ్ శాతం పెరిగితే....ప్ర‌జా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. దీనికి క‌ట్టుబ‌డి పోలింగ్ శాతం పై ల‌గ‌డ‌పాటి ఆధార‌ప‌డి ఫ‌లితం ఇచ్చిన‌ట్లుగా టిఆర్‌య‌స్ అంచ‌నా వేస్తోంది. ల‌గ‌డ పాటి చేసిన మ‌రో విశ్లేష‌ణ తో జాతీయ ఛాన‌ళ్ల స‌ర్వే పై చ‌ర్చ మొద‌లైంది. ఉత్త‌రాదికి చెందిన ఛానళ్లు ద‌క్షిణాది ఓట‌ర్ల నాడిని స‌మ‌ర్ధ‌వంతంగా ప‌సి గ‌ట్ట‌లేవ‌న్న‌ది ల‌గ‌డ‌పాటి వాద‌న‌. తాను మాత్ర‌మే గ‌తంలోనూ ఇచ్చిన అంచ‌నాలు వాస్త‌వ రూపం దాల్చాయ‌ని...ఇవే ఛాన‌ళ్లు ద‌క్షిణాది పై ఇచ్చిన అంచ‌నాలు త‌ప్ప‌య్యాయ‌ని వివ‌రించారు. అదే స‌మ‌యంలో.. ఉత్త‌రాది ఛాన‌ళ్లు..గ్రామీణ ప్రాంతంలో శాంపిల్స్ తీసుకోవ‌ని..ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కే పరిమితం అవుతాయ‌ని..తాము మాత్రం వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో శాస్త్రీయంగా శాంపిల్స్ సేక‌రించామ‌ని చెబుతున్నారు. స్వ‌తంత్రులు..బిజెపి గ‌తం కంటే ఎక్కువ‌గా స్థానాలు గెలుస్తున్నారంటే ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంద‌ని..అదే స‌మ‌యంలో..కాంగ్రెస్ -టిడిపి పొత్తుకు ప్ర‌జామోదం ల‌భించింద‌ని ల‌గ‌డ‌పాటి విశ్లేషిస్తున్నారు.

ల‌గ‌డ‌పాటి స్వీయ అగ్ని ప‌రీక్ష‌..తేడా వ‌స్తే అంతేనా..!

ల‌గ‌డ‌పాటి స్వీయ అగ్ని ప‌రీక్ష‌..తేడా వ‌స్తే అంతేనా..!

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై జాతీయ ఛాన‌ళ్ల‌తో విభేదించి ఒక ర‌కంగా ల‌గ‌డ‌పాటి త‌న‌కు తాను అగ్ని ప‌రీక్ష పెట్టు కున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఒక వైపు హోరా హోరీ పోరు జ‌రిగింద‌ని చెబుతూనే...ఓట‌రు నాడి ప‌ట్టుకోవ‌టం చాలా క‌ష్టంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో చివ‌రి రెండు రోజులు ప‌రిస్థితులు తారు మారు అయ్యాయ‌ని ల‌గ‌డ పాటి చెబుతున్నారు. కానీ, ల‌గ‌డ‌పాటి త‌న అంచ‌నాల ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో కీల‌క‌మైన పోలింగ్ శాతం విష‌యంలో పొరపాటు ప‌డిన విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఆయ‌న తెలంగాణ లో 72 - 74 శాతం వ‌ర‌కు పోలింగ్ న‌మోదైంద‌ని అంచ‌నా వేసారు. కానీ, ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన చివ‌రి స‌మాచారం మేర‌కు 69.1 శాతం న‌మోదైంది. అదే స‌మ‌యంలో రెండు పార్టీల‌కు ప్ల‌స్ ఆర్ మైన‌స్ ప‌ది సీట్ల‌ను ఆప్ష‌న్‌గా ఉంచారు. ఇక‌, తాను గ‌తంలో చెప్పిన ఏ అంచ‌నాలు త‌ప్పు కాలేద‌ని .. ఇప్పుడు అదే జరుగుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయినా..పోస్ట్ పోల్ స‌ర్వేను సైతం నిర్వ‌హిస్తున్నాన‌ని ల‌గ‌డ పాటి చెప్ప‌టం ద్వారా.. త‌న స‌ర్వే పై త‌న‌కే అనుమానాలు ఏమైనా వ‌చ్చాయా అనే సందేహం వ్య‌క్తం అవుతోంది. ల‌గ‌డ పాటిది విశ్వాస‌మో..అతి విశ్వాస‌మో..తేలాలంటే 11న ఫ‌లితాలు రావాల్సిందే. ఇక‌, ఇప్ప‌టికే టిఆర్‌య‌స్..కొంద‌రు తెలంగాణ వాదుల్లో ఇప్ప‌టికీ ల‌గ‌డ‌పాటి పై తెలంగాణ వ్య‌తిరేకి అనే ముద్ర ఉంది. మ‌రి..ఫ‌లితాల అంచ‌నాల వెల్ల‌డి ద్వారా ల‌గ‌డ‌పాటి త‌న‌కు తాను అగ్ని ప‌రీక్ష పెట్టుకున్నారు. మ‌రి..ఇందులో ల‌గ‌డ‌పాటి గెలుస్తారో లేదో చూడాల్సిందే..

English summary
Telangana exit polls predictions created more confusion in public. National Channels projections in favour of TRS and Lagadapati predictions are in favour of Prajakutami. Now..This creating more intresting calculations on voting trends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X