అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి లో కొత్త టెన్ష‌న్ : ఆ మూడు అంశాల తో ఆందోళ‌న : జ‌గ‌న్ నిర్ణ‌యం కోసం ఎదురుచూపులు..!

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపి లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. జ‌గ‌న్ పాద‌యాత్ర తో పార్టీలో కొత్త ఉత్స‌హం వ‌చ్చంద‌నుక‌న్న ఈ స‌మ‌యంలో..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ హామీల‌నే అమలు చేస్తుండ‌టం తో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అనే టెన్ష‌న్ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో..కేటీఆర్ - జ‌గ‌న్ స‌మావేశాన్ని టిఆర్‌య‌స్ -వైసిపి పొత్తుగా టిడిపి చిత్రీకరించి విస్తృ తంగా ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, కొన్ని నియోజక వర్గాల్లో ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చ‌టం కూడా పార్టీలో స‌మ స్య‌గా మారుతోంది. దీంతో...ఈ అంశాల్లో జ‌గ‌న్ ఏ ర‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది పార్టీ కేడ‌ర్ ఎదురు చూస్తోంది..

హామీలు అమలైపోతున్నాయి...

హామీలు అమలైపోతున్నాయి...

వైసిపి అధినేత జ‌గ‌న్ పార్టీ ప్లీన‌రీలో న‌వ ర‌త్నాల‌ను ప్ర‌క‌టించారు. అవి త‌మ‌కు ఓట్లు కురిపిస్తాయ‌ని ఆశించారు. పాద యా త్ర‌లో ఆ ప‌ధ‌కాల‌కు విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పించారు. అయితే, తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ ప‌ధ‌కాల్లో కొన్నిటి ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. పెన్ష‌న్ల‌ను వెయ్యు నుండి రెండు వేల‌కు పెంచుతామ‌ని జ‌గ‌న్ న‌వర‌త్నా ల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి ఆ మొత్తంలో పెన్ష‌న్ల‌ను పెంచి అమ‌లు చేసి చూపిస్తున్నారు. దీంతో..ప్ర‌త్య క్షంగా దాదాపు 620 ల‌క్ష‌ల మంది పై ప్ర‌భావం చూపిస్తోంది. త‌మ హామీని చంద్ర‌బాబు అమ‌లు చేసార‌ని వైసిపి నేత‌లు చెబుతున్నా.. ల‌బ్ది దారులు ఈ క్రెడిట్ ఎవ‌రికి ఇస్తార‌నేది కీల‌కం. హ‌మీ ఇచ్చిన వారికంటే అమ‌లు చేసిన వార‌కే విలు వ ఎక్కువ ఉంటుంద‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. అదే విధంగా..ఉచిత విద్యుత్ ను 9 గంట‌ల పాటు.. రైత‌ల కోసం కొత్త రైతే రాజు పేరుతో ల‌బ్ది చేకూరేలా కొత్త ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారు. ఇవ‌న్నీ..మొత్తంగా జ‌గ‌న్ ఊరూరా తిరిగి ప్ర‌చారం చేసుకున్న ప‌ధ‌కాల‌ను అధికారంలో ఉండ‌టంతో..వాటిని అమ‌లు చేస్తూ చంద్ర‌బాబు రాజ‌కీయంగా దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కేటీఆర్ తో మీటింగ్..పొత్తు పై ప్ర‌చారం..

కేటీఆర్ తో మీటింగ్..పొత్తు పై ప్ర‌చారం..

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో ఆహ్వానం కోస కేటీఆర్ -జ‌గ‌న్ మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. అందులో ఎట‌వంటి నిర్ణ‌యం తీసుకోకపో యినా..ఆ మీటింగ్ వైసిపి పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ఏపి పై ద్వేషం తో ఉన్న టిఆర్‌య‌స్ పార్టీతో జ‌గ‌న్ ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ టిడిపి నేత‌లు రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో..ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక సంకేతాలు వెళ్తున్నాయ‌ని వైసిపి నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏపిలో టిఆర్‌య‌స్ తో పొత్తు ఉండ‌ద ని చెబుతున్నా..ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వ్య‌తిరేక సంకేతాలు వెళ్లాయ‌ని పార్టీ నేత‌ల ఆవేద‌న గా క‌నిపిస్తోంది. తెలంగాన ము ఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చే నెల‌లో ఏపిలో ప‌ర్య‌టించ‌టం..జ‌గ‌న్ ను క‌లుస్తార‌ని చెప్ప‌టం..జ‌గ‌న్ త‌న ఇంటి గృహ‌ప్ర‌వేశా నికి ఆహ్వానించ‌టం వంటివి ఎటువంటి ప‌రిణామాలకు దారి తీస్తారో..ప్ర‌జ‌ల్లో ప్ర‌తికూల సంకేతాలు వెళ్తాయ‌నే భావ‌న పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా..ఏపిలో మాత్రం త‌మ‌కు లాభం కంటే న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌నే అంచ‌నాలో పార్టీ నేత‌లు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ స్పంద‌న కోసం నిరీక్ష‌ణ‌..

జ‌గ‌న్ స్పంద‌న కోసం నిరీక్ష‌ణ‌..


ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌..వైసిపి పై టిడిపి మైండ్ గేమ్ తీవ్ర‌త‌రం చేసింది. కేటీఆర్ తో జ‌గ‌న్ భేటీ పై జ‌గ‌న్ మాట్లాడిన స‌మ‌యంలో..ఏపి -తెలంగాణ ఎంపీలు క‌లిసి పోరాడితే ఏపికి హోదా వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. దీని ద్వా రా జ‌గ‌న్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి వెళ్ల‌టానికి సిద్దంగా ఉన్నార‌నే సంకేతాలు వెళ్లాయి. అయితే, వైసిపి నేత‌లు మాత్రం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరిక అనే అంశం ఎన్నిక‌ల త‌రువాత మాత్ర‌మే ఆలోచించాల్సి ఉంటుంద‌ని..ఏపి ఎన్నిక‌ల పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌ద‌ని చెబుతున్నారు. ఇదే విష‌యం జ‌గ‌న్ స్పష్టంగా చెబుతార‌ని అంటున్నారు. ఇక‌, చంద్ర బాబు అమ‌లు చేస్తున్న త‌మ ప‌ధ‌కాల మీద జ‌గ‌న్ స్పందిస్తార‌ని..అది ప‌రోక్షంగా త‌మ‌కే మేలు చేస్తుంద‌న్న‌ది వైసిపి నేత‌ల వాద‌న‌. ఇదే స‌మ‌యంలో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చి అభ్య‌ర్ధులుగా ఖ‌రారు చేయాల ల‌నే ఒత్తిడి పార్టీ పై ప‌డుతోంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.. ఏ ర‌కంగా అభ్య‌ర్ధుల విష‌యంలో ముందుకు వెళ్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. మొత్తంగా జ‌గ‌న్ స్పంద‌న కోసం పార్టీ నేత‌లు నిరీక్షిస్తున్నారు.

English summary
YCP Cadre in dailama about alliance with TRS. YCP leadrs expressing doubt that TDP leaders propaganda create damage to the party. Party leaders asking Jagan to give clarity on Federal Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X