అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో నాన్ వెజ్ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. కుళ్లిన చికెన్, పిల్లుల మాంసం అమ్ముతున్నారు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : కుళ్లిన చికెన్, పిల్లుల మాంసం.. కాదేదీ నాన్ వెజ్‌కు అనర్హం అంటున్నారు వ్యాపారస్థులు. మాంసం అమ్మకాలకు సరికొత్త భాష్యం చెబుతూ ఏదీ దొరికితే అది అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నాన్ వెజ్ ప్రియుల జీవితాలతో ఆటలాడుతున్నారు. నెల్లూరులో మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపించడంతో చికెన్ వ్యాపారం ముసుగులో జరుగుతున్న "కుళ్లు దందా" కిలోల కొద్దీ బయటపడుతోంది. కోడి మాంసం అమ్ముతూ నోట్ల కట్టలు వేనుకేస్తున్న వ్యాపారస్థులు ప్రజారోగ్యాన్ని మంట గలుపుతున్నారు. అదే క్రమంలో ఇటీవల విశాఖలో వెలుగుచూసిన పిల్లి మాంసం కథ కూడా నివ్వెరపోయేలా చేసింది. నాన్ వెజ్ ప్రియులకు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లైంది.

మాంసం ప్రియుల గుండెల్లో గుబులు

మాంసం ప్రియుల గుండెల్లో గుబులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు మాంసం ప్రియుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కుళ్లిన చికెన్, పిల్లుల మాంసం అమ్ముతున్నారంటూ రోజుకో వార్త బయటకొస్తున్న నేపథ్యంలో ఉలిక్కిపడుతున్నారు. ఏదో వారానికి ఒక్కసారి నాన్ వెజ్ తిందామనుకునేవారు కూడా ఇలాంటి ఘటనలు చూసి భయపడాల్సిన పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఇటీవల మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపిస్తుండటంతో కిలోల కొద్దీ కుళ్లిన చికెన్ పట్టుబడుతుండటం చర్చానీయాంశంగా మారింది.

ప్రాజెక్టుల కిరికిరి.. ఇటు వీళ్లు, అటు వాళ్లు.. ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారమేనా?ప్రాజెక్టుల కిరికిరి.. ఇటు వీళ్లు, అటు వాళ్లు.. ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారమేనా?

చెన్నై, బెంగళూరు నుంచి నాసిరకం చికెన్ దిగుమతి..!

చెన్నై, బెంగళూరు నుంచి నాసిరకం చికెన్ దిగుమతి..!

ఏపీకి పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కుళ్లిన, పాడైపోయిన చికెన్ నెల్లూరులో ప్రత్యక్షం అవుతుండటం నాన్ వెజ్ ప్రియులను భయపెట్టిస్తోంది. అక్కడి నుంచి వచ్చిన ఇలాంటి చికెన్‌ను బార్లు, రెస్టారెంట్లకు అమ్ముతున్నారు వ్యాపారస్థులు. ఒక నెల్లూరులోనే కాదు చుట్టుపక్కల నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాల్లో కూడా నాసిరకం చికెన్ అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. చెన్నై నుంచి ప్రతిరోజు ఇలాంటి చికెన్ వస్తుంటే.. బెంగళూరు నుంచి మాత్రం వారంలో రెండుసార్లు వస్తున్నట్లు తేలింది.

రెగ్యులర్‌గా దాడులు.. పట్టుబడుతున్న వ్యాపారులు

రెగ్యులర్‌గా దాడులు.. పట్టుబడుతున్న వ్యాపారులు

ఇటీవల నెల్లూరులో మున్సిపల్ అధికారులు రెగ్యులర్‌గా దాడులు నిర్వహిస్తుండటంతో కుళ్లిన చికెన్ మాంసం అమ్ముతున్న వైనం బయటపడింది. ఆ క్రమంలో రెస్టారెంట్లు, బార్లపై దాడి చేసి కిలోల కొద్దీ కుళ్లిన చికెన్ మాంసం గుర్తించారు. సదరు వ్యాపారులకు వేలాది రూపాయల జరిమానా విధించారు. అయితే వరుస తనిఖీలతో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఆ నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్న నాసిరకం చికెన్ బాగోతం వెలుగుచూసింది.

కిలో చికెన్ 30 - 40కి కొంటూ.. ప్రజారోగ్యం పట్టించుకోకుండా..!

కిలో చికెన్ 30 - 40కి కొంటూ.. ప్రజారోగ్యం పట్టించుకోకుండా..!

చెన్నై, బెంగళూరు నుంచి నాసిరకం చికెన్‌ను కిలో 30 నుంచి 40 రూపాయలకు కొనుగోలు చేస్తుంటారు వ్యాపారులు. కిలోల కొద్దీ నెల్లూరుకు తీసుకొచ్చి సాధారణ చికెన్ మాంసంతో కలిపి చిన్న చిన్న దుకాణదారులకు విక్రయిస్తుంటారు. వారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడతారు. రోజూ చికెన్ అమ్మే వ్యాపారులే గుర్తు పట్టలేని విషయం ఇక కస్టమర్లు ఎక్కడ గుర్తు పడతారు. అదే అక్రమ వ్యాపారులకు కలిసొచ్చే అంశం. బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు హోటళ్ళకు ఇలాంటి చికెన్ పెద్దమొత్తంలో సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఫ్రిజర్‌లో నిల్వ ఉంచిన 350 కిలోల ఇలాంటి మాంసాన్ని మున్సిపల్ అధికారులు గుర్తించారు.

ఎక్కడో ఉంటారు.. మాయ చేస్తారు.. బ్యాంకు మేనేజర్లను నమ్మించి నిండా ముంచేస్తారు..!ఎక్కడో ఉంటారు.. మాయ చేస్తారు.. బ్యాంకు మేనేజర్లను నమ్మించి నిండా ముంచేస్తారు..!

విశాఖలో పిల్లి మాంసం.. నాన్ వెజ్ ప్రియుల్లో భయం..!

విశాఖలో పిల్లి మాంసం.. నాన్ వెజ్ ప్రియుల్లో భయం..!

ఇక విశాఖపట్నంలో పిల్లి మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం ప్రకంపనలు పుట్టించింది. నాన్ వెజ్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఏదో సరాదాగా హోటల్‌కు వెళ్లి తిందామనుకునే వారిని ఇలాంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. విశాఖలో క్యాట్ మీట్ అనేసరికి మాంసం ప్రియులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు వీధుల్లో తిరుగుతూ పిల్లుల్ని పట్టుకుని వాటి మాంసాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే వార్త భయాందోళనకు గురి చేసింది. విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

English summary
The rotten chicken and the meat of cats, The latest business trend. In Nellore Town Kgs of rotten chicken caught for municipal officials and the same situation happened in Visakhapatnam. Some People sold out the cat meat in Vizag goes hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X