• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. సీఎం జగన్ స్పష్టీకరణ

|

స్కూళ్లు, అంగన్ వాడీ ఉద్యోగులను తొలగించబోమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదన్నారు. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని తేల్చిచెప్పారు. ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఎవరినీ తీసివేసే పరిస్థితి ఉండదని.. లేనిది ఊహించుకోని భయపడొద్దని స్పష్టంచేశారు.

టార్గెట్..2 ఇయర్స్

టార్గెట్..2 ఇయర్స్

విద్యాశాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని తేల్చిచెప్పారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

మండలానికి రెండు కాలేజీలు

మండలానికి రెండు కాలేజీలు

నూతన విద్యా విధానంలో భాగంగా మండలానికి ఒకట్రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చూడాలని.. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. పీపీ-1లో 1, 2 తరగతులకు కిలోమీటర్‌ లోపు పాఠశాల ఉండాలన్నారు. పీపీ-2లో 3-10 తరగతులకు 3 కిలోమీటర్లలోపు హైస్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలన్నారు.

ఓకే టీచర్.. అన్నీ పాఠాలు కాదు

ఓకే టీచర్.. అన్నీ పాఠాలు కాదు

ఒకే టీచర్‌ అన్ని పాఠ్యాంశాలు బోధించే విధానం సరైంది కాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. జులై 1 నుంచి రెండో దశ నాడు-నేడు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై సీఎం జగన్ వద్ద ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ అన్నారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల‌పై మొద‌టి నుంచి త‌మ‌ వైఖ‌రి ఒక్క‌టే అని వివ‌రించారు.

English summary
not remove one employee at school and anganvadi andhra pradesh cm jagan mohan reddy clarify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X