బాంచెన్ రెడ్డి: తమకు సమానంగా పీఆర్సీ, వేతనాలు ఇవ్వండి, సజ్జల కాళ్లమీద పడ్డ..
మరి కొన్ని గంటల్లో సమ్మె చేపడుతామని ఏపీ జేఏసీ స్పష్టంచేయగా.. మంత్రులతో చర్చలు.. కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సీఎం జగన్తో కూడా ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. అయితే సమ్మె ఉండదని.. జగన్ హామీతో వెనక్కి తగ్గుతారని విశ్వసనీయ సమాచారం. కానీ చర్చల తర్వాతే ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడతారు.
ఇటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. స్టీరింగ్ కమిటీతో చర్చల కోసం ఆయన సచివాలయానికి వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తర్వాత ఒక్కసారి సజ్జల కాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో సజ్జల విస్తుపోయారు.

రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తాము పని చేస్తున్నామని వారు చెప్పారు. వారితో సమానంగా తమకు కూడా పీఆర్సీని అమలు చేయాలని కోరారు. తమ కనీస వేతనాన్ని రూ. 15 వేల నుంచి రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని వారు అన్నారు. ఈ విషయాన్ని సజ్జల సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఇటు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. శనివారం పెన్ డౌన్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ జీవోలను వెన్కకి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, అది కుదరదని ప్రభుత్వం అంటోంది.ఫిబ్రవరి 6 నుంచి సమ్మె ఖాయం అని ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ నిన్న మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేయడం తెలిసిందే.