అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ‌ప‌న్ కు ఇర‌కాటం : ఖ‌ండించినా..ఆగ‌ని ప్ర‌చారం: న‌ష్టం తప్ప‌దా..!

|
Google Oneindia TeluguNews

స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ యుద్దం గురించి చేసిన వ్యాఖ్య‌ల వేడి ఇంకా చ‌ల్లార లేదు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారని ఖండించినా..వాటి ప్ర‌చారం ఆగలేదు. పాకిస్థాన్ మీడియా ప‌వ‌న్ ఇలా వ్యాఖ్యానించారంటూ హ‌డావుడి చేసింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై బిజెపి నేత‌లు సీరియ‌స్ గా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ప‌వ‌న్ ను ఈ వ్యాఖ్య‌లు వెంటాడుతున్నాయి.

ఇర‌కాటం లో జ‌న‌సేనాని..

ఇర‌కాటం లో జ‌న‌సేనాని..

జ‌నసేన అధినేత రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితుల పై కొన్ని వ్యాఖ్య‌లు చేసారు. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త త‌లు కొన‌సాగుతున్న స‌మ‌యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. అవి ఒక ర‌కంగా కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితిని సృష్టించాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను పాక్ మీడియాలోనూ ప్ర‌స్తావించారు. వ‌ప‌న్ వ్యాఖ్య‌ల‌ను ఏపి సీయం చంద్ర‌బాబు సైతం పార్టీ నేత‌ల వీడియో కాన్ఫిరెన్స్ లో ప్రస్తావించారు. ప‌వ‌న్ కూడా చెబుతు న్నార‌ని..ఇటువంటి ప‌రిస్థితుల్లో బిజెపి ని ఎలా న‌మ్ముతామంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ఇదే వ్యాఖ్య‌ల పై జ‌న సేన ఖండించింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని..ఆయ‌న ఆ విధంగా అన‌లేద‌ని చెప్పుకొచ్చింది. కానీ , వ‌ప‌న్ వ్యాఖ్య‌ల పై ఇంకా స్పంద‌న‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం కొన‌సాగుతూనే ఉంది.

ఘాటుగా స్పందిస్తున్న బిజెపి నేత‌లు

ఘాటుగా స్పందిస్తున్న బిజెపి నేత‌లు

ప‌వ‌న్ క‌ళ్యాన్ వ్యాఖ్య‌ల పై బిజెపి నేత‌లు సీరియ‌స్ గా స్పందిస్తున్నారు. పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహా రావు పికె అంటే ప‌వ‌న్ క‌ళ్యాన్ అని అనుకుంటున్నామ‌ని..అయితే ఇప్పుడు పికె అంటే పాకిస్థాన్ అని అర్దం అయింద ని తీవ్ర వ్యాఖ్య చేసారు. ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సైతం త‌న విశాఖ స‌భ‌లో ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వీటి పై ఆ వెంట‌నే జ‌న‌సేన త‌మ అధినేత ఆ ర‌కంగా వ్యాఖ్యానించ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అయితే, అప్ప‌టికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఎన్నిక‌ల వేళ ప‌వ‌న్ క‌ళ్యాన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మీడియా ప్రాధాన్య‌త ఇవ్వ‌టం..వాటి పై స్పంద‌న‌లు రావ‌టంతో ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఒక ర‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇర‌కాటంలో ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఖండించినా ప్ర‌చారం ఆగ‌దా..

ఖండించినా ప్ర‌చారం ఆగ‌దా..

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై పాకిస్థాన మీడియా అత్యుత్స‌హం ప్ర‌ద‌ర్శించింది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప‌వ‌న్ వ్యాఖ్యాలు చేసార‌నే ప్ర‌చారం జ‌రిగింది. జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని గ‌మ‌నించి వెంట‌నే జ‌న‌సేన అప్ర‌మ‌త్తం అయింది. కానీ, ఇప్పటికీ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై చ‌ర్చ సాగుతూనే ఉంది. దీనిని మ‌రింత పొడిగించ‌టం ఇష్టం లేని జ‌న‌సేన నేత‌లు వీటి పై స్పందించ‌టం లేదు. అయితే, తాము వివ‌ర‌ణ ఇచ్చినా..ఈ ర‌కంగా ప్ర‌చారం చేయ‌టం పై వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి..ఈ వ్యాఖ్య‌ల ప్ర‌చారానికి ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.

English summary
YCP Chief Pawan Kalyan comments on Boarder situation now became Hot topic in political circles. Janasena denied on the publicity on Pawan comments. But, same discussion on Pawan comments continues. It may cause for political damage of janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X