రాంబో రాంబాబు అనలేదా..? చంద్రబాబు దత్తపుత్రుడు అంటే ఏంటీ: మంత్రి అంబటి
ఏపీలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. జనసేన వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని అంటున్నారు. దీనిపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను అలా అనొద్దు అంటున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు వినిపించుకోవడం లేదు. ప్రత్యేకించి మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు.
చంద్రబాబు దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదని జనసేనాని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆయన చేస్తున్న హెచ్చరికలను ఏపీ మంత్రులు ఖాతరు చేయడం లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పవన్ కల్యాణ్‌కు కనబడటం లేదన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

తమపై వ్యంగ్యంగా మాట్లాడే పవన్.. తనపై మాత్రం సెటైర్లు వేయవద్దంటున్నారు. తనను రాంబో రాంబాబు అనలేదా?" అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని, తమకు సినిమా తీయడం కూడా వచ్చని స్పష్టం చేశారు. 'నారా వారి దత్తపుత్రుడు' అనే సినిమా తీయాలని అనుకుంటున్నామని వెల్లడించారు. పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.
దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తెల్ల మొహం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కంటిన్యూగా చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్‌కు చిర్రెత్తుకు వచ్చింది. తనను అలా అనొద్దు అని కామెంట్ చేశారు. దీనిపై అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.