అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌-వ‌ప‌న్ ల‌ను క‌ల‌ప‌ట‌మే కెసీఆర్ అజెండా:ప‌వ‌న్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చు:విజ‌య‌శాంతి

|
Google Oneindia TeluguNews

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను వివాదంలోకి లాగేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సినీ న‌టి..కాంగ్రెస్ నాయ కురాలు విజ‌య‌శాంతి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ కేసీఆర్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చాని పేర్కొన్నారు. ప‌వ‌న్ - జ‌గ‌న్ కు ఒకే వేదిక మీదకు తేవ‌డ‌మే కేసీర్ అస‌లు అజెండా గా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప‌వ‌న్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చు..

ప‌వ‌న్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చు..

టిఆర్‌య‌స్ అధినేత కేసీఆర్ ఏపి రాజ‌కీయాల్లో చేస్తున్న ప్ర‌య‌త్నాల పై విజ‌య‌శాంతి స్పందించారు. ఏపి రాజ‌కీయా ల్లో ప్ర‌ధాన పార్టీల‌కు స‌మ‌దూరం పాటిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ ను ఏదో ర‌కంగా వివాదంలోకి లాగేందుకు టిఆర్‌య‌స్ కూడా ప్ర‌య‌త్నిస్తోంద‌ని విజ‌య‌శాంతి ఆరోపిస్తున్నారు.

విజ‌య‌శాంతి

విజ‌య‌శాంతి

ప‌వ‌న్ క‌ళ్యాన్ అంత తొంద‌ర‌గా టీఆర్‌య‌స్ అధినేత‌, సీయం కేసీఆర్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీతో 2009లో జత కట్టిన కేసీఆర్ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌కి టీఆరెస్ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందనే అభిప్రాయం వ్య‌క్తం చేసా రు. పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

జ‌గ‌న్ - ప‌వ‌న్ ల‌ను ఒక వేదిక తేవ‌ట‌మే ల‌క్ష్యంగా..

జ‌గ‌న్ - ప‌వ‌న్ ల‌ను ఒక వేదిక తేవ‌ట‌మే ల‌క్ష్యంగా..

ఏపిలో వైసిపి - జ‌న‌సేల‌ను క‌లిపేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ విజ‌య‌శాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు ఇటు తెలంగాణ‌..అటు ఏపి రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాయావతి-అఖిలేష్ యాదవ్‌ల మాదిరిగా పవన్ కళ్యాణ్- చంద్రబాబు కలిస్తే తప్పేంటి అని టీడీపీ లీడర్స్ అంటున్నార ని టి.జి వ్యాఖ్యాల‌ను విజ‌య‌శాంతి గుర్తు చేసారు.ఈ వివా దం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రాజ్ భవన్‌లో కేసీఆర్-పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమైందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏపీకి వెళ్ళి వైఎస్ జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తానన్న కేసీఆర్... అంతకు ముందే పవన్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నారని ప్ర‌శ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ, జనసేనలను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోందని విజ‌య‌శాంతి అంచ‌నా వేసారు. అయితే, విజ‌య‌శాంతి వ్యాఖ్య‌ల పై ఇటు టిఆర్‌య‌స్ కానీ..అటు వైసిపి కానీ..జ‌న‌సేన కానీ స్పందించ‌లేదు.

English summary
Vijayasanthi stated that Telanagana CM KCR planning to tie up between Jagan and Pawan in AP Politics. But, Pawan would not trap in Kcr Strategies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X