అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నదాతలను ఆదుకోండి, రైతుల వెతల వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్..

|
Google Oneindia TeluguNews

నివర్ తుపాన్ బీభత్సంతో అన్నదాత నడ్డి విరిగింది. రైతులతోపాటు కౌలు రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరి బాధలను టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావించారు. వారి సమస్యలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆ రైతుల సమస్యలు పట్టడం లేదా అని అడిగారు. వారిని ఆదుకోవాలని కోరారు.

తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలతో ఏపీలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికి అందిన పంట తుపాను పాలయ్యింది. సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారని నారా లోకేశ్ వెల్లడించారు. కౌలు రౌతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు వేడుకుంటున్నా సీఎం జగన్ మనసు కరగడం లేదని విమర్శించారు. ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం అని అడిగారు.

pls..help to farmers, nara lokesh asks cm jagan..

ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని లోకేశ్ అన్నారు. ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులను వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఓ కౌలు రైతు ఎకరం 30 వేలకు తీసుకున్నాడు.. రూ.15 వేల పెట్టుబడి పెట్టాడు. కానీ చేతికొచ్చిన పంట మాత్రం నీట మునిగింది. ఇలా పలువురు ఆ వీడియోలో తమ గోడును వెల్లబోసుకున్నారు. మరో రైతు రూ.50 వేల పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు.

English summary
help to farmers, tdp leader, mlc nara lokesh naidu asks cm jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X