అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమలాపురం అల్లర్లు: మరో 25 మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కోనసీమ జిల్లా మార్పు పేరుపై రగడ కొనసాగుతోంది. అమలాపురంలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు. అమలాపురం అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్లర్లు, విధ్వంసం వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు 20 వాట్సాప్ గ్రూపులను అందులోని సభ్యులను, 350 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ లను విశ్లేషిస్తున్నారు.

వీడియో క్లిప్పుంగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పుంగుల ఆధారంగా 70 మందిని గుర్తించారు. త్వరలో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని ఆయన తెలిపారు.

 police arrested another 25 members

అంతకుముందు కోన‌సీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు మొత్తం 46 మందిని గుర్తించారు. ఆ 46 మందిపై పలు సెక్లన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.మ‌రింత మందిపైనా కేసులు న‌మోదు చేసే దిశ‌గా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ కోన‌సీమ జిల్లా కార్య‌ద‌ర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్య‌మ నేత న‌ల్లా సూర్య‌చంద‌ర్ రావు కుమారుడు అజ‌య్ ఉన్నారు.

ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.చేశారు. సామర్లకోటకి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు.. వజ్ర వెహికల్ లో గత రెండేళ్లుగా హోంగార్డుగా సుబ్రహ్మణ్యం పని చేస్తున్నారు. కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌పై కేసు కట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుపై కేసు.. కోనసీమలో విధ్వంసంపై మరో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం.

English summary
police arrest another 25 members in amalapuram riots case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X