అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కోనసీమ ముద్దు అంబేద్కర్ వద్ద అని నిర్వహించిన కార్యక్రమంలో సాయి ఒంటి పై పెట్రోల్ పోసుకున్నాడు. నిరసన కార్యక్రమంలో పాల్గోన్న 19 మంది పై కూడా పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 188 ల తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు మొత్తం 46 మందిని గుర్తించారు. ఆ 46 మందిపై పలు సెక్లన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.మరింత మందిపైనా కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు అజయ్ ఉన్నారు.
ఆందోళనకారులపై 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 r/w 149 IPC, 3, 4 PDPPA, 32 PA-1861 సెక్షన్ల కింద కేసు నమోదు.చేశారు. సామర్లకోటకి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు.. వజ్ర వెహికల్ లో గత రెండేళ్లుగా హోంగార్డుగా సుబ్రహ్మణ్యం పని చేస్తున్నారు. కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌పై కేసు కట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుపై కేసు.. కోనసీమలో విధ్వంసంపై మరో మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సమాచారం.