అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ‌లో ఏపి ఉద్యోగుల ఓట్లు : ఎవ‌రి వైపు మొగ్గు..!

|
Google Oneindia TeluguNews

ఏపి ఉద్యోగుల ఓట్లు ఎవ‌రికి. హైద‌రాబాద్ లో ఉంటూ ఏపిలో ఉద్యోగం చేస్తున్న వారు త‌మ ఓటు హ‌క్కు వినియోగంచుకొ నేందుకు సిద్ద‌మ‌య్యారు. తాము ఓటు వేసేందుకు వీలు క‌ల్పిస్తూ త‌మ‌కు తెలంగాణ ఎన్నిక‌ల రోజున సెల‌వు మంజూరు చేయాల‌ని ఏపి ఉద్యోగ సంఘాల నాయ‌కులు విజ్ఞ‌ప్తి చేసారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం వారికి స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్ మంజూ రు చేసింది. దీంతో...ఉద్యోగులు తెలంగాణ‌లో ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అయితే, ఇప్ప‌టికే తెలంగాణ లో హోరా హోరీ పోరులో ప్ర‌తీ నియోజ‌క‌వర్గం..ప్ర‌తీ వ‌ర్గం ఓట్లు కీల‌కంగా మారాయి. ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వ ఉద్యోగుల ఓట్లు ద‌క్కించుకోవ‌టానికి సైతం పార్టీలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి...

Political Parties Trying for AP Employees votes : They vote for..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం డిసెంబరు 7న వారికి సెలవు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలినా.. ఓటు హక్కు మాత్రం తెలంగాణలోనే ఉంది. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలిలో మూడు వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 11 వేల మంది ఏపీ ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ఎన్నికల్లో ఓటేయొచ్చని అధికారిక వర్గాల అంచనా. ప్ర‌తీ ఓటు కీల‌కంగా మారుతుండ‌టంతో..ఏపి ఉద్యోగుల ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు ప్రారం భించాయి. ఇప్ప‌టికే ఉద్యోగ సంఘ నేత‌ల‌ను ఆకట్టుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఏపి ఉద్యోగులు ఖ‌చ్చితంగ త‌మ కే ప‌ట్టం క‌డ‌తార‌ని కాంగ్రెస్ -టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఏపిలో ప్రభుత్వం పై స్థానికంగా వ్య‌తిరేక‌త ఉంద‌ని..ఉద్యోగుల్లో సైతం అసంతృప్తి ఉందంటున్న టిఆర్‌య‌స్ నేత‌లు త‌మ పార్టీకే ఓటు వేసి టిడిపి పై త‌మ‌కున్న అసంతృప్తిని తెలియ‌చేస్తార‌ని చెబుతున్నారు. ఇక‌, ఉద్యోగుల నివాసాలు హైదరాబాద్‌లోనే ఉండ‌టంతో.. వారు టిఆర్‌య‌స్ వైపే మొగ్గు చూపుతార‌ని ఆ పార్టీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

అయితే, ఏపి ఉద్యోగులు వారి కుటుంబ స‌భ్యులు ఎక్కువ‌గా ఎల్‌బిన‌గ‌ర్, మ‌హేశ్వ‌రం, చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే ఉన్న‌ట్లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపి సెటిల‌ర్స్ ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయ‌. వారికి తోడు ఏపిలో ఉద్యోగాలు చేస్తున్న వారి ఓట్లు సైతం గెలుపు ఓట‌ముల పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. దీంతో..
ఉద్యోగ సంఘ నేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకొని..వారి ద్వారా త‌మ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకొనేందుకు ఇప్ప టికే జోరుగా మంత‌నాలు సాగుతున్నాయి. మ‌రి..ఉద్యోగులు ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి....

English summary
AP Government Employees have their votes in Telangana. Now thier votes becoming crucial in Greater Hyderabad Assembly segments. Parties trying for employees and family members votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X