అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమ్మవాళ్లే సుహాసినికి ఓటేయలేదు, కేసీఆర్ వచ్చినా జగన్‌కే: పోసాని, పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Posani Krishna Murali Controversial Comments on Kamma Caste | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి రావాలని, ఆయన వచ్చినప్పటికీ తన ఓటు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికేనని, వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి బుధవారం చెప్పారు. ఏపీలో కేసీఆర్ పోటీ చేసినా తన ఓటు వైసీపీకే అన్నారు.

పాదయాత్రతో జగన్‌కు మంచి ఆదరణ వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిల తర్వాత ఈయనకే వచ్చిందని చెప్పారు. జగన్ పరిపక్వత గల నాయకుడని చెప్పారు. ఆయన గెలిస్తే కులపిచ్చి, రౌడీయిజం, దోపిడీలు ఉండవని చెప్పారు. ఏపీ బాగుపడుతుందని తెలిపారు. లోకేష్‌ను తాను నాయకుడిగా పరిగణించనని చెప్పారు. అడ్డదారిలో మంత్రి అయ్యారన్నారు.

ఏపీలో కమ్మ దురద ఎక్కించారు

ఏపీలో కమ్మ దురద ఎక్కించారు

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటాడని చంద్రబాబు చెప్పారని, కానీ వనజాక్షి పైన దాడి కనిపించలేదా అని పోసాని ప్రశ్నించారు. ఆంధ్రలో కమ్మవాళ్లు అంటరాని వారిగా బతుకుతున్నారని చెప్పారు. ఇందుకు చంద్రబాబే కారణం అన్నారు. ఆంధ్రలో ప్రజలకు కమ్మ దురద ఎక్కించారన్నారు. కమ్మవాడు అంటే నీతి, నిజాయితీ, ఇతరులకు సాయం చేసేవాడని, కష్టపడేవాడని చెప్పారు.

నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీబండారం రోడ్లపైకి తెస్తా, నా దురదృష్టం: జగన్‌కు పవన్ గట్టివార్నింగ్నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీబండారం రోడ్లపైకి తెస్తా, నా దురదృష్టం: జగన్‌కు పవన్ గట్టివార్నింగ్

కమ్మవాళ్లే సుహాసినికి ఓటు వేయలేదు

కమ్మవాళ్లే సుహాసినికి ఓటు వేయలేదు

అందుకే తెలంగాణలో ఉన్న కమ్మవాళ్లు కూకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి ఓటు వేయలేదని పోసాని చెప్పారు. ఇక్కడి కమ్మలు తెరాసకు ఓటు వేశారని చెప్పారు. తెలంగాణలోని కమ్మలు విజ్ఞతతో వ్యవహరించారని చెప్పారు. సుహాసినిని బలిపశువు చేశారని చెప్పారు. ఆంధ్రాలోని కమ్మవాళ్లు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో సమాజం కమ్మలను వెలివేసే పరిస్థితి వస్తుందన్నారు.

బాలకృష్ణ ఎంతమంది తాట తీశాడో అందరికీ తెలుసు

బాలకృష్ణ ఎంతమంది తాట తీశాడో అందరికీ తెలుసు

వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన దాడిని చంద్రబాబు అపహాస్యం చేశారని పోసాని మండిపడ్డారు. జగన్‌కు ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుకు లేదని చెప్పారు. భర్తలను, కొడుకులను చంపే మహిళలు చంద్రబాబు కుటుంబంలోనే ఉన్నారని ఆరోపించారు. బాలకృష్ణ ఎంతమంది తాట తీశాడో సమాజానికి తెలుసునని చెప్పారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేసినా, చంపిన వారిని బాలకృష్ణ ఏం చేశాడో తెలియదా అన్నారు.

కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలి

కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలి

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ కచ్చితంగా వెళ్లాల్సిందేనని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నారు. పోలింగ్‌కు ముందే సర్వే వివరాలు ఎందుకు చెప్పాడో లగడపాటి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో గొప్ప నాయకుల్లో హరీష్ రావు ఒకడనిచెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎవరైనా ముఖ్యమంత్రికి అర్హులేనని చెప్పారు. ఏపీలో తెరాస పోటీ చేసినా జగన్‌కే తన మద్దతు అన్నారు. లోకేష్ ప్రచారం చేయలేదు కాబట్టి తెలంగాణలో టీడీపీకి రెండు సీట్లు అయినా వచ్చాయని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్‌కు హితవు

పవన్ కళ్యాణ్‌కు హితవు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా పోసాని మాట్లాడారు. జగన్‌ను పదేపదే రెచ్చగొడుతున్నారని, అందుకే ఆయన జనసేనాని పైకి ఎదురు విమర్శలు చేస్తున్నారని పోసాని చెప్పారు. జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల మధ్యకు వెళ్లారని చెప్పారు. ఆయనను ఊరికే పవన్ కళ్యాణ్ విమర్శించడం సరికాదని చెప్పారు.

English summary
Tollywood actor Posani Krishna Murali lashed out AP CM Nara Chandrababu naidu, Minister Nara Lokesh and Hindupuram MLA Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X