అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్ కుమార్ లేఖ..

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. అదలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలంటూ లేఖ రాశారు. వైసిపి అధినేత జగన్ ఏ అభిప్రాయం అయితే వ్యక్తం చేశారో అదే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రజత్ కుమార్

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రజత్ కుమార్

తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయంలోతెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖతోఆయనఎన్నికలపైతన అభిప్రాయాన్ని వెల్లడించారు.రానున్న సార్వత్రిక ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో నిర్వహించాలని ,రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం వుందని, క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ కు ఎక్కువ ఆస్కారం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికల నిర్వహణ ..డూప్లికేట్ ఓటింగ్ కు చెక్

రెండు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికల నిర్వహణ ..డూప్లికేట్ ఓటింగ్ కు చెక్

గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయని.. ఈ ఎన్నికల తోపాటే ఏపీలో 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని.. అప్పుడప్పుడు తమ స్వస్థలాలకు వెళ్ళి వస్తుంటారని చెప్పారు. ఈ క్రమంలో వారు రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఒకే రోజు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావులేకుండా చేయడంతోపాటు డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివాటిని నివారించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ప్రతిపాదించారు.

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఈసీ ని కలిసిన జగన్

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఈసీ ని కలిసిన జగన్

ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ని కలిసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఏపీ, తెలంగాణలో ఉన్న ఓటర్లు రెండు రాష్ట్రాలలోనూ ఓటు హక్కు నమోదు చేసుకోవడం వల్ల డూప్లికేట్ ఓటింగ్ కు ఎక్కువ అవకాశముందని, అలా జరగకుండా ఉండాలంటే లోక్ సభ ఎన్నికలు ఒకేరోజు పెట్టేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల పారదర్శకంగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక తాజాగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు.

 రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు అవకాశం

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు అవకాశం

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరగాలని చేశారు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Telangana state Chief Election officer rajath kumar to the CEC to Conduct Lok Sabha polls in Telangana and AP on same day. Recently YSRCP President Y S Jaganmohan Reddy also urged Chief Election Commissioner Sunil Arora to conduct the parliamentary elections in Andhra Pradesh and Telangana on the same day as many people are registered to votes in both the states.After the state bifurcation, many people still have their votes in both the states. The CEC or the Chief Election Commissioner has been requested to hold the elections in Telangana and Andhra Pradesh on the same day so that such voters cast their vote in one state only . With these representations it seems the CEC will respond positively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X