అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన పార్టీ, వైసీపీ, టీఆర్ఎస్‌లు ఈ యాప్ ద్వారానే ప్రజలకు చేరువవుతున్నాయి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana & Andhra elections : షేర్‌చాట్ ద్వారా దూసుకుపోతున్న జనసేన, టీఆర్ఎస్, వైసీపీ | Oneindia

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోలింగ్ ముగియగా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలతో సభలతో హోరెత్తిస్తున్నాయి. అంతే కాదు ఓటరును తమ పార్టీకే ఓటు వేయాలని చెప్పేందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు పార్టీలు. ఇప్పటికే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్‌లు సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్లలను సైతం వేదికగా మలుచుకుని ప్రచారం చేస్తుండగా... ప్రాంతీయ పార్టీలు మాత్రం మరోలా ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నాయి.

 2014 ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన సోషల్ మీడియా

2014 ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన సోషల్ మీడియా


2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను ఆ సమయంలో ఎక్కువగా వినియోగించుకుంది మాత్రం నాటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ. అదే ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ఈసారి కూడా బీజేపీ కాంగ్రెస్‌లాంటి పార్టీలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ ద్వారా ప్రచారం నిర్వహిస్తుండగా ...ప్రాంతీయ పార్టీలు మాత్రం షేర్‌చాట్ యాప్ ద్వారా ఓటర్లను ఓటును అభ్యర్థిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా పద్దతిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ప్రచారంను డిజిటల్ పద్ధతిలో సైతం చేస్తున్నాయి. ఇక షేర్‌చాట్ యాప్ ఎక్కువగా వినియోగిస్తున్న పార్టీల్లో వైసీపీ, జనసేన పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు విరివిగా ఈ యాప్‌ను వినియోగిస్తున్నాయి. ఏపీతో పాటు కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ కూడా షేర్‌చాట్ యాప్‌ను బాగా వినియోగిస్తోంది.

షేర్‌చాట్ యాప్ వైపు మొగ్గు చూపుతున్న ప్రాంతీయ పార్టీలు

షేర్‌చాట్ యాప్ వైపు మొగ్గు చూపుతున్న ప్రాంతీయ పార్టీలు


ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే...కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్‌తో పాటు షేర్‌చాట్ కూడా వినియోగిస్తోంది.ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీ కూడా షేర్‌చాట్ వేదికగా ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి కనబర్చింది. ఈ వారంలోనే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా షేర్‌చాట్‌లో చేరింది. ఇంటర్నెట్‌ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నవారికి షేర్‌చాట్ యాప్ మంచి వేదిక అవుతుందని షేర్ చాట్ యాప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇందులో భాగంగానే రాజకీయపార్టీలు షేర్‌చాట్ యాప్ వైపు మొగ్గుచూపుతున్నాయని చెప్పారు. సోషల్‌మీడియాలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని ..అయితే షేర్‌చాట్ ద్వారా వాట్సాప్‌లో కూడా షేర్ చేసే వీలుంది కాబట్టి దాన్నే మంచి ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు టీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ వెల్లడించింది.

 భాషా పరమైన ఆప్షన్ ఇవ్వడంతో చాలామంది షేర్‌చాట్

భాషా పరమైన ఆప్షన్ ఇవ్వడంతో చాలామంది షేర్‌చాట్

తెలుగు భాష మాట్లాడే వారు దాదాపు 2 మిలియన్ నుంచి 4.5 మిలియన్ వారు షేర్‌చాట్ వినియోగిస్తున్నారని సంస్థ పేర్కొంది. భాషా పరమైన ఆప్షన్ ఇవ్వడంతో చాలామంది షేర్‌చాట్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.ఇక తెలుగు రాష్ట్రల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్రంగా సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకుని ప్రజలకు చేరువవుతోంది. 6లక్షల55వేల ఫాలోవర్స్ ఉన్నట్లు సమాచారం.

 సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వైసీపీ అధినేత జగన్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వైసీపీ అధినేత జగన్

ఇక సోషల్ మీడియాను చాలా బాగా వినియోగించుకుంటున్న పార్టీల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కూడా ముందుంది. జనసేన అభిమానులు వైసీపీ అభిమానులు నిత్యం సోషల్ మీడియా ద్వారా చిన్న పాటి యుద్ధమే చేస్తున్నారు. జగన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలను పలకిరిస్తూ ఉంటారు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన విషయాలను పోస్టు చేస్తూ ఉంటారు. అంతేకాదు జగన్ పాదయాత్రలో ఉన్నందున దాన్ని సూచిస్తూ ఒక ఎమోజీ హ్యాష్ ట్యాగ్‌ కూడా వైసీపీ డిజిటల్ టీమ్ తయారు చేసి ప్రమోట్ చేస్తోంది.

English summary
Even as the two major national parties the ruling Bharatiya Janata Party and Congress are sparring it out on large, mainstream social media platforms like Twitter, Facebook and WhatsApp, smaller regional parties, especially in South India have taken a unique route to reach voters: Indian language content apps like ShareChat. At least three regional parties in Telangana and neighbouring Andhra Pradesh have been actively using the platform as part of their digital campaign strategy. Among them are YSR Congress in Andhra, Jana Sena Party in Telangana and Andhra, and Telangana Rashtra Samiti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X